ఉపాధి హామీకి వెయ్యి కోట్లివ్వండి

17 Sep, 2017 01:55 IST|Sakshi

కేంద్రానికి మంత్రి జూపల్లి లేఖ
సాక్షి, హైదరాబాద్‌:
రాష్ట్రానికి రావాల్సిన ఉపాధి హామీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధి శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌కు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విజ్ఞప్తి చేశారు. శనివారం ఈ మేరకు కేంద్ర మంత్రికి లేఖ రాశారు. రూ.500 కోట్ల వేతన, రూ.500కోట్ల మెటీరియట్‌ కాంపోనెంట్‌ నిధులను విడుదల చేయాలని కోరారు. రాష్ట్రం లో 438 మండలాలు, 8,517 గ్రామాల్లో ఉపాధి హామీ పథకాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడు గుం తలు, అంగన్‌వాడీ, గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలు, అంతర్గత రోడ్ల నిర్మాణం భారీ స్థాయిలో చేపడుతున్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.250 కోట్ల వేతన, రూ.135 కోట్ల మెటీరియల్‌ కాంపో నెంట్‌ నిధులను కేంద్రం విడుదల చేయాల్సి ఉందని లేఖలో జూపల్లి వివరించారు. కేంద్రం నుంచి నిధుల విడుదలలో జాప్యం వల్ల ఉపాధి పనుల పురోగతికి ఆటంకం ఏర్పడు తోందన్నారు.

మరిన్ని వార్తలు