జైళ్ల శాఖకు రూ.17 కోట్ల  ఆదాయం: డీజీ వినయ్‌కుమార్‌ సింగ్‌ 

11 Jan, 2019 02:02 IST|Sakshi

హైదరాబాద్‌: తెలంగాణ జైళ్ల శాఖ ఆదాయం 2014లో రూ.3 కోట్లు ఉండగా, 2018లో రూ.17 కోట్ల ఆదాయం గడించామని ఆ శాఖ డీజీ వినయ్‌కుమార్‌ సింగ్‌ చెప్పారు. గురువారం చంచల్‌ గూడలోని సీకా కార్యాలయంలో ఏర్పాటు చేసిన వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖైదీల ఆరోగ్యం పట్ల జైళ్ల శాఖ ప్రత్యేక శ్రద్ధ వహిస్తుండటంతో కొన్నేళ్లుగా మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. మరణాల సంఖ్య 2014లో 56 ఉండగా, 2018లో కేవలం 8 ఉందన్నారు.

ఈ ఏడాది 100 పెట్రోల్‌ బంక్‌లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఇటీవల రాష్ట్ర జైళ్లను సందర్శించిన బంగ్లాదేశ్, తీహార్‌ జైలు అధికారులు తెలంగాణ జైళ్ల శాఖ పనితీరును అభినందించారన్నారు. జైళ్ల శాఖ నిర్వహిస్తున్న పరిశ్రమలు, పెట్రోల్‌ బంక్‌ల ద్వారా 2018లో రూ.496 కోట్ల టర్నోవర్‌ సాధించామని, ఇందులో రూ.17 కోట్ల 72 లక్షల లాభం పొందినట్లు తెలిపారు. 2018లో 34 మంది ఖైదీలకు రూ.8 లక్షల రుణాల ఇచ్చినట్లు, విద్యాదానం ద్వారా 22 వేల మంది ఖైదీలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దినట్లు పేర్కొన్నారు. 
 

మరిన్ని వార్తలు