బండ్లకే ఫుట్‌పాత్‌!

31 Oct, 2019 11:30 IST|Sakshi
బల్కంపేటలో ఫుట్‌పాత్‌పై వరుసగా నిలిపిన సెకండ్‌ సేల్స్‌ కార్లు

పాదచారుల బాటను ఆక్రమించి సెకండ్‌హ్యాండ్‌ సేల్‌ వ్యాపారం  

బల్కంపేట ప్రాంతంలో ప్రజలకు ఇబ్బందులు  

అమీర్‌పేట: సెకండ్‌హ్యాండ్‌ సేల్‌ వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఫుట్‌పాత్‌లను ఆక్రమించి వ్యాపార సముదాయాలుగా మార్చేస్తున్నారు. దీనికి తోడు ప్రైవేట్‌ సంస్థల వాహనాలనూ రోడ్లపైనే నిలుపుతుండడంతో పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులను ఆదేశించినా ఫలితం లేకుండా పోతోందని స్థానికులు వాపోతున్నారు. కార్ల సెకండ్‌ సేల్స్‌కు బల్కంపేట, అమీర్‌పేట, సంజీవరెడ్డినగర్‌ ప్రాంతాలు కేంద్రాలుగా మారాయి. చాలామంది ఇక్కడి పరిసర ప్రాంతాల్లో  వ్యాపారాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.అయితే వాహనాలు పార్కింగ్‌ చేసేందుకు వీలున్న చోట వ్యాపారాలు చేయాల్సి ఉండగా.. చాలామంది నివాస గృహాలను అద్దెకు తీసుకొని బిజినెస్‌ నడిపిస్తున్నారు. విక్రయానికి వచ్చే కార్లను రోజుల తరబడి ఫుట్‌పాత్‌లపై నిలిపి ఉంచుతున్నారు. ఫలితంగా నిత్యం రద్దీగా ఉండే బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం వెనకా, 60 ఫీట్‌ రోడ్డు, బీకేగూడ, ఈఎస్‌ఐ ఆసుపత్రి ప్రాంతాల్లో తరుచూ ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. ఎస్‌ఆర్‌నగర్‌ కమ్యూనిటీ హాలు నుంచి బీకేగూడ మున్సిపల్‌ వార్డు కార్యాలయం వరకు ఫుట్‌పాత్‌లు పూర్తిగా కనుమరుగయ్యాయి. దీనిపై బల్దియా అధికారులు, ట్రాఫిక్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆకాశవీధిలో ఆరగిద్దాం

ప్రమాదాలకు నిలయంగా సాగర్‌ ఎడమకాల్వ

పోలీస్‌ వాహనాన్ని ఢీకొట్టిన కారు

చిత్రమైన చీర

మెదక్‌లో ఉద్రిక్తత; విద్యార్థిని మృతదేహంతో నిరసన

ఫ్యాన్సీ నంబర్స్‌కు భలే క్రేజ్‌

ఆపద్బాంధవుడు హనీఫ్‌..

మేడం.. నేను పోలీస్‌నవుతా !

మంచానికి కట్టేసి.. నిప్పంటించి..

పగ్గాలు ఎవరికో?

తెలంగాణలో శానిటేషన్‌ హబ్‌

దీక్ష కొనసాగిస్తా: కూనంనేని

సకలజనుల సమ్మెతో సమం

‘టీబీని తరిమేద్దాం ’

విష జ్వరాలపై అధ్యయనం

ఐటీడీఏ ముట్టడికి యత్నం

కార్మికులను రెచ్చగొట్టే యత్నం: లక్ష్మణ్‌

ఉత్తమ్‌కు కేసీఆర్‌ దెబ్బ రుచి చూపించాం

20 వేల బస్సులైనా తీసుకురండి

డెంగీతో ఒకే కుటుంబంలో నలుగురు మృతి

భాగ్యనగరం.. ఉక్కునగరం! 

ఓటీపీ లేకుండానే ఓవర్సీస్‌ దోపిడీ

అవసరమైతే మిలియన్‌ మార్చ్‌!

వృద్ధ దంపతుల సజీవ దహనం

గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి

ఈనాటి ముఖ్యాంశాలు

‘కేసీఆర్‌ను ఓడించి.. వాళ్లను గెలిపిద్దాం’

రసాభాసగా ఐటీడీఏ సమావేశం

ఆర్టీసీ సమ్మె : ‘వారు జీతాలు పెంచాలని కోరడం లేదు’

మూడు తరాలను కబళించిన డెంగీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ మనసు గెలుచుకున్న ఏకైక వ్యక్తి

ప్రిన్స్‌ ఇంట ‘బాయిదూజ్‌’ సంబరం

ఓ పెద్ద దిక్కుని కోల్పోయాం : న‌రేష్‌

బిడ్డ సరే... మరి నీ భర్త ఎక్కడ?

ప్రకాశ్‌రాజ్‌ను బహిష్కరించాలి

సీనియర్‌ నటి గీతాంజలి కన్నుమూత