రావణ దహనానికి పోటాపోటీ ఏర్పాట్లు

3 Oct, 2014 01:08 IST|Sakshi

పటాన్‌చెరు: పటాన్‌చెరు పారిశ్రామికవాడలో దసరా ఉత్సవాలకు పెద్ద ఎత్తున ఖర్చు చేసేందుకు నిర్వాహకులు వెనుకాడటంలేదు. ప్రతి ఏటా రావణ దహనానికి పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్నారు. నేతలు పోటీ పడి మరీ ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పటాన్‌చెరు పట్టణంలో రెండు దశాబ్దాలుగా మైత్రి గ్రౌండ్స్‌లో రావణ దహన కార ్యక్రమం కొనసాగుతుంది.

పట్టణంలో జరిగే దసరా ఉత్సవాల్లో రాజకీయాలకు తావివ్వకుండా పుర ప్రముఖులంతా ఐక్యంగా పండగ ఏర్పాట్లు చేస్తారు. అధికారంలో ఉన్న వారు తమ వంతు సహకారంగా ఏర్పాట్ల నిర్వహణకు ముందుకు రావడం ఆనవాయితీగా వస్తోంది. అయితే పండుగ రోజున అన్ని పార్టీల వారు వారి అభిమానులు కలిసి పండుగ నిర్వహిస్తారు. పట్టణంలోని పౌరులంతా మైత్రి గ్రౌండ్స్‌కు చేరుకుని రావణ దహన కార్యక్రమాన్ని వీక్షిస్తారు. అంతకు ముందు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఇతర పెద్దలందతా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తారు.

 ఇక్కడ ఈ సంస్కృతి చాలా కాలంగా సాగుతోంది. మండలం పరిధిలో ఇదే తీరులో అమీన్‌పూర్, పాశమైలారంలలో కూడా గత మూడు ఏళ్లుగా సాగుతుంది. పాశమైలారంలో ఈ సారి రూ.అయిదు లక్షలు వెచ్చించి సర్పంచ్ సుధాకర్‌గౌడ్ రావణ దహనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. సంగారెడ్డిలో రావణ విగ్రహం ఏర్పాటు చేసే కళాకారులే ఇక్కడ ఆ రూపాన్ని నిర్మిస్తున్నారు. రాజమండ్రి నుంచి వచ్చిన నిపుణలు బాణా సంచాను తెచ్చి విగ్రహాన్ని దహనం చేసే ప్రక్రియను నిర్వహిస్తున్నారు. ఇందుకు రూ.2.50 లక్షలు వెచ్చిస్తున్నారు.

 లక్ష తీసుకుంటాం: నందీశ్వర్, విగ్రహ రూపకర్త
 రావణ దహన కార్యక్రమానికి ప్రతి దసరాకు తాము సంగారెడ్డిలో రావణ విగ్రహాన్ని రూపుదిద్దుతాము.
 ఖైరతాబాద్ నివాసులం. మా వర్కర్లు 15 మంది ఈ విగ్రహాల నిర్మాణానికి 15 రోజుల పాటు పని చేస్తారు.  ఈ ఏడాది హైదరాబాద్‌లోని కొంపల్లి, పటాన్‌చెరులోని పాశమైలారంలలో రావణ దహనం కోసం విగ్రహాలను ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేస్తున్నాం. సాధారణంగా చాలా మంది తడికలు వాడుతారు.
 మేం దాంతో పాటు విగ్రహానికి మంచి రంగు వచ్చే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో దాన్ని తీర్చిదిద్దుతున్నాము. అలాగే క్షణాల్లో విగ్రహం దహన మయ్యేలా తయారు చేయడం మా ప్రత్యేకత.

మరిన్ని వార్తలు