మెడికల్ కాలేజ్ ఏర్పాటు అనుకోని కల!

2 Aug, 2019 15:25 IST|Sakshi

మంత్రి చేతుల మీదుగా నేడు మెడికల్ కళాశాల ప్రజలకు అంకితం  

పట్టణంలో నెలకొన్న పండుగ వాతావరణం

సాక్షి, సుర్యాపేట: సూర్యాపేట జిల్లా చరిత్రలో నవశకానికి అడుగులు పడబోతున్నాయి. మెడికల్ కళాశాల ఏర్పాటు ఊహకందని కల అని, కళ్ల ఎదుటే సాక్షాత్కరించబోతుందని స్థానిక శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. మెడికల్ కాలేజ్ ఏర్పాటుతో సూర్యాపేట చరిత్రలోనే నవశకానికి నాంది పడింది అన్నారు. అభివృద్ధిలో జిల్లా ముందు ఉందనీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో మెడికల్ కాలేజ్ రావడంతో ఆయనకు ఎంతో రుణపడి ఉంటామని తెలిపారు. అంతేకాక కలెక్టర్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మురళి చేసిన సేవలు మరువలేమన్నారు. కళాశాల అభివృద్ధి కి ఉన్న అడ్డంకులను అన్ని అధిగమించి కళాశాల ఏర్పాటు చేసుకొవడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులకు ఏ సమస్య వచ్చిన తీర్చడానికి నేను ఉన్నానంటూ విద్యాశాఖ మంత్రి హామీ ఇచ్చారు. సూర్యపేట మెడికల్‌ కళాశాలో చదువుకున్న విధార్ధులు దేశ వ్యాప్తంగా పేరు తీసుకురావాలని కోరారు.

సూర్యాపేట జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలను మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రజలకు అంకితం చేస్తుడటంతో పండుగ వాతావరణం నెలకొంది. మంత్రి ఆశయం వెరసి ఏర్పడిన మెడికల్ కళాశాలలో శ్రావణ శుక్రవారం తొలిఘడియాలలో మొదటి బ్యాచ్ ప్రారంభం కాబోతోంది.

వివరాల్లోకి వెళితే.. జిల్లాల పునర్విభజన లో భాగంగా మంత్రి జగదీష్ రెడ్డిని గెలిపిస్తే సూర్యాపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తామంటూ 2014 ఎన్నికలలో ఇచ్చిన హామీని అమలు పరచడమే కాకుండా అదనంగా కొత్త జిల్లాకు మెడికల్ కళాశాల ఇస్తానని పేట సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ అమలులో సాక్షాత్కరించబోతుంది. సుమారు 500 కోట్ల అంచనా వ్యయంతో పేటలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టినా శాశ్వత భవనాల నిర్మాణంలో జాప్యం జరుగుతోందన్నఅంశాన్ని గుర్తించిన మంత్రి జగదీష్ రెడ్డి మినరల్ ఫండ్తో స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో మెడికల్ కళాశాలను యుద్దప్రాతిపదికన ఏర్పాటు చేసిన విషయం విదితమే.ఇచ్చిన హామీని అతి తక్కువ కాలంలో ఆచరణలోకి తేవడమే కాకుండా కళాశాలను ప్రారంభిస్తున్న శుభవేళ సూర్యాపేటలో పండుగ వాతావరణం నెలకొంది.
 

>
మరిన్ని వార్తలు