కాచిగూడ వద్ద ప్రమాదం.. పలు రైళ్ల రద్దు 

12 Nov, 2019 02:48 IST|Sakshi

ఎంఎంటీఎస్‌ సహా పలు రైళ్ల రద్దు 

తీవ్ర ఇబ్బందులకు గురైన ప్రయాణికులు 

సాక్షి, హైదరాబాద్‌ : కాచిగూడ రైల్వేస్టేషన్‌లో ఎంఎంటీఎస్‌ రైలు, హంద్రీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్న ప్రమాద ఘటన నేపథ్యంలో సోమవారం కాచిగూడ మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లను రద్దు చేశారు. 12 ఎంఎంటీఎస్‌ రైళ్లు, 16 ప్యాసింజర్‌ రైళ్లు, మరో 3 ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేశారు. అలాగే 38 రైళ్లు పాక్షికంగా రద్దు కాగా, మరో 7 రైళ్లను వివిధ మార్గాల్లో మళ్లించారు. 6 రైళ్ల వేళల్లో మార్పులు చేశారు. ఎంఎంటీఎస్‌ రైళ్ల రద్దుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వరకూ రాకపోకలు సాగించే ఎంఎంటీఎస్‌ సర్వీసులు సికింద్రాబాద్‌ వరకే పరిమితమయ్యాయి. నాంపల్లి నుంచి ఫలక్‌నుమా మధ్య సర్వీసులు కూడా నిలిచిపోయాయి. కొన్నింటిని పాక్షికంగా రద్దు చేయగా, మరికొన్నింటిని దారి మళ్లించారు. 

రద్దయిన రైళ్లు.. 

  • కాచిగూడ–చెంగల్పట్టు (17652), కాచిగూడ–టాటానగర్‌ (07438/07439), కాచిగూడ–చిత్తూరు (12797/12798) ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రద్దయ్యాయి. 
  • కాచిగూడ–గుంటూరు ఎక్స్‌ప్రెస్, ఫలక్‌నుమా–ఉందానగర్, ఉందానగర్‌–సికింద్రాబాద్, కాచిగూడ–కర్నూల్‌ సిటీ, మహబూబ్‌నగర్‌–మీర్జాపల్లి, మహబూబ్‌నగర్‌–కాచిగూడ రైళ్లు రద్దయ్యాయి. 
  • షోలాపూర్‌–ఫలక్‌నుమా (57659) రైలును సనత్‌నగర్‌ వరకే పరిమితం చేశారు. బోధన్‌–మహబూబ్‌నగర్‌ ప్యాసింజర్‌ రైలు మల్కాజిగిరి వరకే పరిమితమైంది. మల్కాజిగిరి–మహబూబ్‌నగర్‌ మధ్య నడిచే రైలును రద్దు చేశారు.  
  • మిర్యాలగూడ–కాచిగూడ ప్యాసింజర్‌ రైలు ను సీతాఫల్‌మండి వద్ద నిలిపివేశారు. కాచిగూడ నుంచి మిర్యాలగూడ వెళ్లవలసిన రైలును సీతాఫల్‌మండి నుంచి నడిపారు. 
  • బోధన్‌–మహబూబ్‌నగర్, నిజామాబాద్‌–కాచిగూడ రైళ్లను మల్కాజిగిరి వరకు పరిమితం చేశారు. వికారాబాద్‌–కాచిగూడ రైలు సికింద్రాబాద్‌ వరకు పరిమితమైంది. మేడ్చల్‌–కాచిగూడ రైలును బొల్లారం వరకే నడిపారు. నడికుడి–కాచిగూడ రైలు మల్కాజిగిరి వరకు నడిపారు. 

పలు రైళ్ల దారి మళ్లింపు.. 
అమరావతి–తిరుపతి బైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌ (12766)ను బొల్లారం–సికింద్రాబాద్‌–గుంతకల్‌–గుత్తి మీదుగా మళ్లించారు. కాచిగూ డ–చెంగల్పట్టు (17652) ఎక్స్‌ప్రెస్‌ను సికింద్రాబాద్‌–రాయ్‌చూర్‌–గుంతకల్‌–గుత్తి మీదుగా మళ్లించారు. కోయంబత్తూర్‌–హజ్రత్‌ నిజాముద్దీన్‌ (12647) ఎక్స్‌ప్రెస్‌ను డోన్‌–గుంతకల్‌–సికింద్రాబాద్‌ మార్గంలో మళ్లించారు. నాగర్‌సోల్‌–చెన్నై (16004) ఎక్స్‌ప్రెస్‌ను సికింద్రాబాద్, రాయచూర్, గుంతకల్‌ మీదుగా మళ్లించారు. కాచిగూడ–రేపల్లె (17625) రైలు సోమవారం రాత్రి 10.10కి బయలుదేరవలసి ఉండగా దీనిని అర్ధరాత్రి 12.30కి మార్చారు.   

మరిన్ని వార్తలు