సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌

7 Oct, 2017 02:23 IST|Sakshi

45.40 శాతంతో 23,848 ఓట్లు 

గత ఎన్నికల్లో 38.69 శాతంతో 23,311 ఓట్లు 

ఈసారి 37.37 శాతంతో 19,631 ఓట్లు సాధించిన ఏఐటీయూసీ 

సింగరేణివ్యాప్తంగా రెండు యూనియన్లకే ప్రాతినిధ్యం 

సాక్షి, కొత్తగూడెం: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్, ఏఐటీయూసీల మధ్య జరిగిన పోరులో టీబీజీకేఎస్‌ వరుసగా రెండో సారి విజయం సాధించింది. 2012లో జరిగిన గత ఎన్నికలతో పాటు ఈసారి ఈ రెండింటి మధ్యే ప్రధాన పోటీ జరిగింది. గత ఎన్నికలతో పోల్చుకుంటే ప్రస్తుతం టీబీజీకేఎస్, ఏఐటీయూసీలు ఓట్ల సంఖ్యను గణనీయంగా పెంచుకున్నాయి. సింగరేణిలోని మొత్తం 11 ఏరియాల్లో 9 చోట్ల టీబీజీకేఎస్‌ విజయం సాధించగా.. ఏఐటీయూసీ 2 చోట్ల గెలిచింది.

2012 ఎన్నికల్లో 5 చోట్ల టీబీజీకేఎస్‌ విజయం సాధించి గుర్తింపు సంఘంగా ఉండగా.. 2 చోట్ల ఏఐటీయూసీ, 2 చోట్ల ఐఎన్‌టీయూసీ, మరో రెండు చోట్ల హెచ్‌ఎంఎస్‌ గెలుపొంది ఆయా ఏరియాల్లో ప్రాతినిధ్య సంఘాలుగా వ్యవహరించాయి. ఈసారి మాత్రం మొత్తంగా 2 యూనియన్లే గెలుపొందాయి. 2012లో టీబీజీకేఎస్‌ 38.69 శాతంతో 23,311 ఓట్లు సాధించగా.. ఏఐటీయూసీ 27.76 శాతంతో 16,724 ఓట్లు సాధించింది. ప్రస్తుత ఎన్నికల్లో టీబీజీకేఎస్‌ 45.40 శాతంతో 23,848 ఓట్లు సాధించగా.. ఏఐటీయూసీ 37.37 శాతంలో 19,631 ఓట్లు సాధించింది.

మరిన్ని వార్తలు