'టీఆర్ఎస్ ఏజెంటులా వ్యవహరిస్తున్నారు'

14 Jun, 2015 16:24 IST|Sakshi
'టీఆర్ఎస్ ఏజెంటులా వ్యవహరిస్తున్నారు'

హైదరాబాద్: టీడీపీ ఓటుకు నోటు వ్యవహారం, పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్న టీఆర్ఎస్ పై గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నట్టు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈనెల 29, 30 తేదీల్లో రాహుల్ గాంధీ రెండు రాష్ట్రాల్లో పర్యటించే అవకాశముందని చెప్పారు. తమ పార్టీ నాయకులతో ఆదివారం ఆయన సమావేశం నిర్వహించారు.

తర్వాత విలేకరులతో మాట్లాడుతూ... గ్రేటర్ హైదరాబాద్ వార్డుల విభజనలో జీహెచ్ ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్, అధికార పార్టీ నేతలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సోమేశ్ కుమార్ టీఆర్ఎస్ ఏజెంటులా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎంఐఎం, టీఆర్ఎస్ లకు అనుకూలంగా వార్డుల విభజన జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఏపీ ఐఏఎస్ అధికారి అయిన సోమేశ్ కుమార్ టీఆర్ఎస్ కు లబ్ధి చేకూరేలా రాజకీయ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వార్డుల విభజనపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయకపోగా నిర్వహించినట్టు అబద్దాలు చెబుతున్నారని ఉత్తమ్ కుమార్ విమర్శించారు.

మరిన్ని వార్తలు