‘తెలంగాణలో కూడా ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తాం’

23 Oct, 2023 21:21 IST|Sakshi

సూర్యాపేట జిల్లా: రాహుల్‌ గాంధీపై కేటీఆర్‌, కవితలు చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. రాహుల్‌గాంధీని విమర్శించే స్థాయి కేటీఆర్‌, కవితలకు లేదని మండిపడ్డారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన ఘనత గాంధీ కుటుంబానిదని, తెలంగాణను దోపిడీ చేసిన కుటుంబం కల్వకుంట్లదన్నారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చామని, తెలంగాణలో కూడా ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.

మరిన్ని వార్తలు