స్వల్ప ఊరట

10 May, 2019 09:38 IST|Sakshi

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: సబ్సిడీ సోయా విత్తనాల ధరను స్వల్పంగా తగ్గిస్తూ వ్యవసాయ శాఖ నిర్ణయం తీసుకుంది. గతేడాది కంటే క్వింటాలుపై రూ.50 తగ్గించింది. 2018 ఖరీఫ్‌ సీజనులో క్వింటాలు విత్తనాలకు రైతులు చెల్లించాల్సిన మొత్తం రూ.3,700 ఉండేది. ఈసారి ధర రూ.3,650లకు తగ్గించింది. ప్రభుత్వం ఒక్కో క్వింటాలుపై రూ.2,500 సబ్సిడీని భరిస్తోంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కమిషనరేట్‌ నుంచి ఇటీవల ఆదేశాలందాయి.

ఆరుతడి పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించేందుకు సర్కారు ఏటా సబ్సిడీపై సోయా విత్తనాలను సరఫరా చేస్తోంది. ఇందుకోసం మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాల నుంచి విత్తనాలను కొనుగోలు చేస్తుంది. ఆయా రాష్ట్రాల్లోని విత్తన ఏజెన్సీల నుంచి సేకరిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలైన తెలంగాణ సీడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, నేషనల్‌ సీడ్‌ కార్పొరేషన్, హాకా వంటి సంస్థల ద్వారా రైతులకు సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేస్తోంది. కాగా గతేడాది ఖరీఫ్‌ సీజనులో ఈ విత్తన ధర క్వింటాలుకు రూ.6,200 చొప్పున నిర్ణయించగా, ఈసారి రూ.6,150 చొప్పున విక్రయించాలని సర్కారు నిర్ణయించింది.

పెరుగుతున్న విత్తన ధరలు.. 
సోయా విత్తనాల కొనుగోలు ధర ఏటా పెరుగుతూ వస్తోంది. 2017 ఖరీఫ్‌ సీజనులో క్వింటాలుకు రూ.5,475 చొప్పున కొనుగోలు ధరగా నిర్ణయించింది. 2018 ఖరీఫ్‌ సీజను నాటికి ఈ ధర క్వింటాలుకు రూ.6,200లకు పెరిగింది. రైతులపై భారం పడకుండా ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మొత్తాన్ని కూడా గత ఏడాది పెంచింది. క్వింటాలుపై రూ.1,825 నుంచి రూ.2,500లకు పెంచింది. దీంతో రైతులపై భారం పడలేదు.

వరి తర్వాత సోయానే అధికం.. 
జిల్లాలో ఏటా ఖరీఫ్‌ సీజనులో వరి తర్వాత సోయానే అ«త్యధికంగా సాగు చేస్తారు. జిల్లాలో మొత్తం సాగు విస్తీర్ణం 4.32 లక్షల ఎకరాలు కాగా, గతేడాది సుమారు 83 వేల ఎకరాల్లో సోయా పంట సాగైంది. ఈసారి ప్రాజెక్టుల నీటి మట్టం ఆశాజనకంగా కనిపించక పోవడంతో సోయా సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలున్నట్లు వ్యవసాయశాఖ భావిస్తోంది. ఈ సారి పంట సాగు విస్తీర్ణం 1.12 లక్షల ఎకరాలకు పెరగనున్నట్లు అంచనా వేస్తోంది. సుమారు 30 వేల క్వింటాళ్ల సోయా విత్తనాలను సబ్సిడీపై అందించాలని భావిస్తోంది. ఈ మేరకు వ్యవసాయశాఖ కమిషనరేట్‌కు అధికారులు ప్రతిపాదనలు పంపారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

స్లాబ్‌ మీద పడటంతో బాలుడు మృతి..!

ప్రాణం పోయినా మాట తప్పను 

నడిగడ్డను దోచుకున్నారు..

మొదలైన ఉజ్జయినీ మహంకాళి బోనాలు 

ఎయిర్‌పోర్టు ఆశలకు రెక్కలు..! 

హలంపట్టి.. పొలం దున్నిన 

మైసమ్మతల్లి విగ్రహం అపహరణ

బావిలో పడిన దుస్తులు తీయబోయి..

బాయిమీది పేరే లెక్క.. 

‘కేసీఆర్‌ సారు, కేటీఆర్‌ సారు ఉండవు’

కొలువిచ్చారు సరే.. జీతాలు మరీ..?

‘కొత్తగా సీఎం అయినట్లు మాట్లాడుతున్నారు’

వ్యవసాయ శాస్త్రవేత్తగా రైతు బిడ్డ 

‘డబ్బు’ల్‌ ధమాకా! 

‘పేదలకు ఏం కావాలో సీఎంకు తెలుసు’

సీపీఐ కొత్త సారథి డి.రాజా

వరద వదలదు.. ట్రాఫిక్‌ కదలదు

ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై మొండి వైఖరి వద్దు

8 నిమిషాలు.. 80 వేల కణాలు

ఈడబ్ల్యూఎస్‌ మెడికల్‌ సీట్లకు కౌన్సెలింగ్‌

ఆరోగ్య తెలంగాణే ధ్యేయం

నిండైన పదజాలం గోరా శాస్త్రి సొంతం 

రాకాసి పట్టణం

‘ఇస్మార్ట్‌ ’ పోలీస్‌!

సోషల్‌ మీడియా: కెరీర్‌కు సైతం తీవ్ర నష్టం

వీఆర్వో వ్యవస్థ రద్దు?

నడిరోడ్డుపై హత్య చేసి తలతో పోలీస్‌ స్టేషన్‌కి..

​​22న కేసీఆర్‌ చింతమడక పర్యటన

ఎంపీ సోయం బాపూరావు వివాదాస్పద వ్యాఖ్యలు

ఈనాటి ముఖ్యాంశాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ధమ్కీ ఇవ్వడం పూర్తయింది

నవ్వించే ఇట్టిమాణి

లాయర్‌ మంజిమా

ఎదురు చూస్తున్నా

ప్రియమైన బిజీ

రెండేళ్లు శ్రమించా