సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు 

28 Dec, 2018 00:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సంక్రాంతి నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆరు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఉమాశంకర్‌ కుమార్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.  సికింద్రాబాద్‌–కాకినాడ: సికింద్రాబాద్‌–కాకినాడ సువిధ (నం. 82709) ప్రత్యేక రైళ్లు జనవరి 11, 12, 13 తేదీల్లో సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 8 గంటలకు బయల్దేరి మరునాడు ఉదయం ఉదయం 6.25కు కాకినాడకు చేరుతుంది. కాజీపేట, ఖమ్మం, రాయపాడు, ఏలూరు, తాడేపల్లి గూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారపూడి, సామర్లకోటలో హాల్టి్టంగ్‌ కల్పించారు. 

∙కాచిగూడ–కాకినాడ: కాచిగూడ–కాకినాడ సువిధ (నం. 82724) ప్రత్యేక రైళ్లు జనవరి 11, 12, 13 తేదీల్లో రాత్రి 9.15 గంటలకు బయల్దేరి మరునాడు ఉ.7.45 గంటలకు కాకినాడకు చేరతాయి. మల్కాజిగిరి, కాజీపేట ఖమ్మం, రాయపాడు, ఏలూరు, తాడేపల్లి గూడెం, నిడదవోలు, రాజమండ్రి, ద్వారకాపూడి, సామర్లకోటలో హాల్టింగ్‌ కల్పించారు.మచిలీపట్నం–సికింద్రాబాద్‌ రైలు రద్దు:   జనవరి 10న మచిలీపట్నం నుంచి బయల్దేరాల్సిన మచిలీపట్నం–సికింద్రాబాద్‌ (నం.07251) ప్రత్యేక రైలును రద్దు చేశారు. 

మరిన్ని వార్తలు