ఉడత దేశ భక్తి

16 Aug, 2018 09:20 IST|Sakshi

హైదరాబాద్‌ : త్రేతాయుగంలోనే ఉడత తన భక్తిని చాటుకుందని పురాణాలు చెబుతున్నాయి. నేటికీ ‘ఉడత భక్తి’ అనే పదం చాలా సందర్భాల్లో మనం వాడుతుంటాం.. అయితే ఇక్కడ ఉడత తన దేశభక్తిని చాటుకుంది. బుధవారం అందరూ స్వాతంత్య్ర వేడుకల్లో ఉండగా చిన్నారులు చిట్టి జెండాలను తీసుకొని ఆట స్థలంలో పెట్టి వందనం చేసి వెళ్లగా.. ఓ చెట్టుపై నుంచి వచ్చిన ఉడత చిట్టి జెండాకు వందనం చేస్తున్నట్లు కనిపించడంతో కొండాపూర్‌లోని గౌతమి ఎన్‌క్లేవ్‌ కాలనీవాసుల దృష్టంతా అటువైపే మళ్లింది.  అక్కడే ఉన్న  ఓ ఫొటో గ్రాఫర్‌ ఈ చిత్రాన్ని తన కెమెరాలో బందించారు.  

మరిన్ని వార్తలు