మ్యాజిక్ స్క్వేర్‌లో సిద్దిపేట విద్యార్థుల ప్రతిభ

20 Dec, 2015 01:05 IST|Sakshi
మ్యాజిక్ స్క్వేర్‌లో సిద్దిపేట విద్యార్థుల ప్రతిభ

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకు ప్రయత్నం
 
 సిద్దిపేట జోన్: మెదక్ జిల్లా సిద్దిపేటలోని అంబిటస్ పాఠశాల విద్యార్థులు మ్యాజిక్ స్క్వేర్‌లో విశేష ప్రతిభ చాటారు. వారం రోజులుగా కఠిన శిక్షణతో గిన్నిస్ బుక్  రికార్డ్స్‌లో చోటుకు ప్రయత్నిస్తూ.. యునెటైడ్ వరల్డ్ రికార్డు (చెన్నై), స్టార్ వరల్డ్ రికార్డు (యూఎస్), బుక్ ఆఫ్ స్టేట్ రికార్డు (తెలంగాణ)లను వీరు సొంతం చేసుకున్నారు. ఈ మూడు సంస్థల ప్రతినిధి వై.రమేశ్ సమక్షంలో వీరు ఈ రికార్డుల్ని సాధించారు. 333 మంది విద్యార్థులు గ్రూప్ విధానంలో 8 నిమిషాల 22 సెకండ్లలో 7 రకాల గణిత గడులను మ్యాజిక్ స్క్వేర్ పద్ధతిన పూరించారు. అలాగే 555 మంది విద్యార్థులు ఏకకాలంలో 99 మ్యాజిక్ స్క్వేర్‌ను 3 నిమిషాల 29 సెకండ్లలో గడులను పూరించి మరో రికార్డును సొంతం చేసుకున్నారు. ఈ వివరాలను ప్రతినిధి రమేష్ త్వరలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులకు అందజేయనున్నారు.

 మ్యాజిక్ స్క్వేర్ అంటే: చతురస్ర గడుల్లో వరుస అంకెలను నింపడం ద్వారా ఎటు నుంచి కూడినా ఒకే మొత్తం వచ్చే విధానాన్ని మ్యాజిక్ స్క్వేర్‌గా పిలుస్తారు. ఈ ప్రక్రియను చైనాకు చెందిన  గణిత శాస్త్రవేత్త లోషు తొలిసారిగా ప్రపంచానికి తెలియజేశారు. వరల్డ్ రికార్డ్స్ ప్రకారం జర్మనీకి చెందిన నార్‌బర్క్ బెంకె అనే వ్యక్తి 1111 గీ 1111 గడులను నింపి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని అంబిటస్ పాఠశాల విద్యార్థులు 555 మంది ఒకేసారి మ్యాజిక్ స్క్వేర్‌ను నిర్ణీత గడువులో పూరించి రికార్డును సొంతం చేసుకోవాలనే ప్రయత్నాన్ని చేపట్టారు.

మరిన్ని వార్తలు