కోదండరామ్‌ అరెస్ట్‌; టెన్షన్‌

10 Mar, 2018 15:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ను పోలీసులు శనివారం మధ్యాహ్నం అరెస్ట్‌ చేశారు. తార్నాకలోని తన నివాసం నుంచి మిలియన్‌ మార్చ్‌ సభకు బయలుదేరుతుండగా తీవ్ర ఉద్రిక్తతల నడుమ ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను వాహనాన్ని భారీగా పోలీసులు చుట్టుముట్టారు. దీంతో ఆయన చాలాసేపు కారులోనే ఉండిపోయారు. తర్వాత ఆయనను అరెస్ట్‌ చేసి బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇప్పటికే పలువురు జేఏసీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీపీఐ నాయకుడు చాడా వెంకటరెడ్డిని పార్టీ కార్యాలయంలోనే అరెస్ట్‌ చేశారు.

కాగా, ట్యాంక్‌బండ్‌పై మిలియన్‌ మార్చ్‌ సభకు అనుమతి లేదని, ఇటువైపు వచ్చిన వారిని అరెస్ట్‌ చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ట్యాంక్‌బండ్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. ఇటువైపు వచ్చే దారులను మూసివేసినప్పటికీ కొంత ట్యాంక్‌బండ్‌ చేరుకున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ సాయంత్రం సభ నిర్వహించి తీరతామని జేఏసీ నాయకులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ట్యాంక్‌బండ్‌ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మరిన్ని వార్తలు