అగ్ర కులాల పెత్తనం ఇంకెన్నాళ్లు: వీహెచ్‌

8 Aug, 2019 21:43 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ : టీపీసీసీ ప్రెసిడెంట్‌ పదవిని బీసీలకే ఇవ్వాలని మాజీ ఎంపీ వి హనుమంతరావు డిమాండ్ చేశారు. అగ్రకులాల పెత్తనం ఇంకెన్ని రోజులు భరించాలని కాంగ్రెస్‌ అధిష్టానాన్ని ప్రశ్నించారు. గతంలో పొన్నాల లక్ష్మయ్యకు పదవి ఇచ్చి ఇట్టే తీసేశారన్న సంగతి గుర్తుంచుకోవాలని కోరారు. తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు ఇప్పుడు తనపై కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడికి కొప్పుల రాజు అంటే భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ సీటు విషయంలో పొంగులేటి సుధాకర్‌రెడ్డిని ఏఐసీసీ సెక్రటరీ డబ్బులడిగినందుకే ఆయన పార్టీ నుంచి వెళ్లిపోయారని ఆరోపించారు. మరోవైపు బీసీలకు జరుగుతున్నఅన్యాయాలను ఎవరికి చెప్పాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు