టీఆర్‌ఎస్‌లో చేరిన చైర్మన్ మోహన్‌గౌడ్

23 Apr, 2016 02:15 IST|Sakshi
టీఆర్‌ఎస్‌లో చేరిన చైర్మన్ మోహన్‌గౌడ్

నాగర్‌కర్నూల్ : నాగర్‌కర్నూల్ నగరపంచాయతీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే వంగా మోహన్‌గౌడ్ శుక్రవారం టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఆది నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన మోహన్‌గౌడ్ హైదరాబాద్‌లో సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం కేసీఆర్, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో చేరిన అనంతరం మోహన్‌గౌడ్ ‘సాక్షి’ విలేకరితో ఫోన్‌లో మాట్లాడారు. నాగర్‌కర్నూల్ పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడపించేందుకే టీఆర్‌ఎస్‌లో చేరినట్లు తెలిపారు.

నగరపంచాయతీలో ఎమ్మెల్యే సహకారంతో పర్మినెంట్ సిబ్బందిని కేటాయించుకొని అభివృద్ధి పనులు ముందుకెళ్లేలా చూస్తానని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సారథ్యంలో జక్కా రఘునందన్‌రెడ్డి సహకారంతో అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెడతానని అన్నారు. వంగా మోహన్‌గౌడ్‌తో పాటు మరో 20మంది ఇతరపార్టీలకు చెందిన నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

మరిన్ని వార్తలు