హామీల అమలులో టీఆర్‌ఎస్‌ విఫలం: పి. సుదర్శన్‌ రెడ్డి 

5 Dec, 2018 19:23 IST|Sakshi
విశ్వబ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న మాజీమంత్రి పి. సుదర్శన్‌ రెడ్డి 

 సాక్షి, బోధన్‌రూరల్‌: గత ఎన్నికల్లో ప్రజలకు అనేక హామీలను ఇచ్చిన టీఆర్‌ఎస్‌ అధికారంలో రాగానే వాటిని అమలు చేయడంతో విఫలమైందని మాజీ మంత్రి, బోధన్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి పి. సుదర్శన్‌ రెడ్డి అన్నారు. మంగళవారం మండంలోని చెక్కి క్యాంప్, పెంటాకుర్దూ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తప్పనిసరిగా కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని పార్టీ అధికారంలోకి మేనిఫేస్టోలో ఉన్నవిఅన్ని అమలు చేస్తామన్నారు.  టీఆర్‌ఎస్‌కు ఈ ఎన్నికల్లో ప్రజలు సరైన బుద్ధి చెప్పాలని ఆయన కోరారు.  కార్యక్రమంలో ఎంపీపీ గంగాశంకర్, మండలాధ్యక్షులు నాగేశ్వర్‌రావ్, పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి కృషి చేస్తాం 

బోధన్‌టౌన్‌ : విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి కాంగ్రెస్‌ ఎల్లవేళల కృషి చేస్తుందని మాజీ మంత్రి సుదర్శన్‌ రెడ్డి అన్నారు. పట్టణ శివారులోని ఏఆర్‌ గార్డెన్‌లో విశ్వబ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి మాజీ మంత్రి ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విశ్వబ్రాహ్మణులు  అభివృద్ధికి పార్టీ కట్టుబడి ఉందని పేర్కొన్నారు.  

కొడంగల్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధి  రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం టీఆర్‌ఎస్‌ పిరికి పందచర్య అన్నారు. ఈ సమ్మేళనంలో విశ్వబ్రాహ్మణుల సంఘం జిల్లా అధ్యక్షులు రమణాచారీ, సభా«ధ్యక్షులు హరికాంత్‌ చారీ, ఓబీసీ రాష్ట్ర కన్వీనర్‌ దోసపల్లి నరహారి నాయకులు కెప్టెన్‌ కరుణాకర్‌రెడ్డి, అమర్‌నాథ్‌బాబు, గోపాల్‌రెడ్డి, హన్మంత్‌రావ్, మహమూద్, విశ్వబ్రాహ్మణ సంఘం వివిధ మండలాల అధ్యక్షులు భూమాచారీ, ప్రసాద్, మల్లెపూల రవి, గంగాధర్‌చారీ, చంద్రశేఖర్‌ చారీ, సత్యం చారీ, మురారి, జనార్ధన్‌చారీ ఉన్నారు.

 ఎడపల్లి :  కుర్నాపల్లి, మండల కేంద్రంలో పి.సుదర్శన్‌రెడ్డి ప్రధాన వీదుల గుండా రోడ్‌షో నిర్వహించి ఎన్నికల ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు టపాకాయలు పేల్చి సుదర్శన్‌రెడ్డికి ఘనస్వాగతం పలికారు.

 రెంజల్‌ :  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చేలా చేస్తుందని సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు.  మండలంలోని బాగేపల్లిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్‌ మేనిఫెస్టోలోని çహామీలను నెరవేరుస్తుందని భరోసా ఇచ్చారు.

మరిన్ని వార్తలు