వచ్చేది టీఆర్‌ఎస్‌ సర్కారే 

15 Nov, 2018 15:07 IST|Sakshi
టీఆర్‌ఎస్‌లో చేరిన కొర్విచెడ్‌ యువకులు  

మంత్రి మహేందర్‌రెడ్డి 

సాక్షి, బషీరాబాద్‌: గులాబీ గూటికి వలసలు కొనసాగుతున్నాయి. బషీరాబాద్‌ మండలంలో పలు గ్రామాలు, తండాల నుంచి కాంగ్రెస్‌ కార్యకర్తలు నిత్యం పార్టీలో చేరుతున్నారు. బుధవారం కాశీంపూర్, మల్కన్‌గిరి, కొర్విచెడ్, ఎక్మాయి గ్రామాలకు చెందిన వందల మంది యువకులు టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరడానికి యువత స్వచ్ఛంధంగా ముందుకు వస్తున్నారని అన్నారు. పార్టీలో చేరిన యువతకు మున్ముందు పెద్దపీట వేస్తామని భరోసా ఇచ్చారు. వచ్చేది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని అన్నారు.

యువకులు టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోను ఇంటింటికి తిరిగి తెలియజేయాలని  సూచించారు. ప్రతీ కార్యకర్త ఈనెల రోజులు సైనికుళ్ల పనిచేయాలని సూచించారు. యువతే టీఆర్‌ఎస్‌ పార్టీకి వెన్నుముక అని వాఖ్యానించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వెంకట్‌రామ్‌రెడ్డి, జిల్లా రైతుసమితి సభ్యుడు అజయ్‌ప్రసాద్, రైతు సమితి మండల కోఆర్డినేటర్‌ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్టీ సెల్‌ మండల నాయకుడు బన్సీలాల్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి అబ్దుల్‌ రజాక్, వడ్డే హన్మంతు, రవిప్రసాద్, రియాజ్, తుకారం తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు