సమ్మె కొనసాగిస్తాం..

24 Nov, 2019 03:07 IST|Sakshi

అశ్వత్థామరెడ్డి వెల్లడి

అఫ్జల్‌గంజ్‌: ఆర్టీసీ కార్మికుల సమ్మె యథావిధిగా కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి తెలిపారు. శనివారం మహాత్మాగాంధీ బస్‌ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఎలాంటి షరతులు పెట్టకుండా కార్మికులను విధుల్లో చేర్చుకోవాలని, ఈ విషయంపై సీఎం కేసీఆర్‌ సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఆదివారం మరోసారి జేఏసీ సమావేశం నిర్వహించి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఎంజీబీఎస్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నేడు ఆర్టీసీ మహిళా ఉద్యోగులతో మానవహారం, మౌన దీక్ష నిర్వహిస్తామని చెప్పారు. అన్ని డిపోల ముందు ప్రొఫెస ర్‌ జయశంకర్‌ చిత్రపటానికి నివాళులర్పించి మానవహారాలుగా ఏర్పడి నిరస న తెలపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కో కన్వీనర్‌ రాజలింగం తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

లాక్‌డౌన్‌ మంచిదే..

లాక్‌డౌన్‌ పొడిగించే అవకాశం

ఐఐటీయన్లకు కరోనా కష్టాలు

లాక్‌డౌన్‌ నుంచి పరిశ్రమలను మినహాయించండి

సోనియా సూచన సరైంది కాదు..

సినిమా

చిన్న స్క్రీన్‌ పెద్ద ఊరట

ప్రముఖ బాలీవుడ్ నిర్మాతకు పాజిటివ్

క్రికెట‌ర్‌ను కొట్టిన ప్రియ‌మ‌ణి..ఏమైందంటే?

బన్నీ ‘ఐకాన్‌’పై మరోసారి క్లారిటీ..

ప్ర‌భాస్‌ను చిక్కుల్లోకి నెట్టిన అభిమానులు

క‌రోనా వార్త‌ల‌పై నటి క్లారిటి