మహారాష్ట్ర పాఠ్యాంశాల్లోకి వనజీవి రామయ్య?

10 May, 2017 08:56 IST|Sakshi

ఖమ్మం రూరల్‌: ఖమ్మం జిల్లా రెడ్డిపల్లికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య జీవిత చరిత్రను మహారాష్ట్ర ప్రభుత్వం పాఠ్యాంశంగా చేర్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. కోటి మొక్కలు నాటి పద్మశ్రీ పొందిన రామయ్య కృషిని గుర్తించిన మహారాష్ట్ర సర్కారు తెలుగు సబ్జెక్ట్‌లో ఒక పాఠంగా పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం.

రామయ్య సమాజానికి, ప్రజలకు మొక్కలు నాటడం ద్వారా చేసిన సేవలను పాఠ్యాంశాల్లో చేర్చి విద్యార్థులకు వివరించాలని నిర్ణయించి నట్లు తెలిసింది. మంగళవారం  మహారాష్ట్రకు చెందిన ఓ అధికారి రామయ్యకు ఫోన్ చేసి ఈ విషయాన్ని సూచనప్రాయంగా చెప్పినట్టు సమాచారం. 

మరిన్ని వార్తలు