ఎట్లున్నరో..ఎప్పుడొస్తరో?

30 Jun, 2014 03:04 IST|Sakshi
ఎట్లున్నరో..ఎప్పుడొస్తరో?

 కన్నకొడుకు కోసం.. కట్టుకున్నవారి రాకకోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు మెట్లంకుంట వాసులు. ఉన్న ఊరిలో ఉపాధి లేక.. అప్పులు తీర్చలేక.. బతుకుదెరువు కోసం పొట్టచేత పట్టుకుని ఇరాక్ వెళ్లినవారి కుటుంబసభ్యుల వేదన, రోదన అంతాఇంత కాదు. ఇరాక్‌లో అంతర్యుద్ధం జరుగుతుండడంతో కునుకులేకుండా గడుపుతున్నారు.
 
 ‘బువ్వ ముద్ద దిగడంలేదు.. పొయ్యి రాజెయ్యడంలేదు.. చేసిన అప్పులను తీర్చేందుకు వెళ్లిన కొడుకు ఏమైపోతడో’ అని ఓ కన్నపేగు, ‘నాలుగు పైసలు చేతబుట్టుకొని వస్తన్నడు.. నా భర్త ఏమైపోయాడో ఏమో!’ అని ఓ ఇల్లాలు, ‘బాకీలు తీర్చి ఏ బాధ లేకుండా సుఖంగా నాన్న ఉందామన్నడు.. వారమైంది సమాచారం లేదు’ అంటూ ఓ కూతురు తమ వారి కోసం తల్లడిల్లిపోతున్నారు. ‘కనీసం తిండి లేదు.. బాంబుల కాలుష్యానికి తాగునీరు లేదు. ఆరోగ్యం చెడిపోయింది. మా క్షేమం గురించి ఆశలు వదులుకోవాలి’ అని   ఇరాక్ వెళ్లిన చెప్పినట్లు కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.   
 
 బొంరాస్‌పేట: విదేశాల వలసలకు కేరాఫ్‌గా ఉన్న మెట్లకుంట ప్రస్తుతం ఇరాక్ అల్లర్ల కా రణంగా వలస జీవుల కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. ఇరాక్‌లో తలదాచుకుని బం దీలు గా బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్న వల స జీవు ల కుటుంబాల ఆవేదన అరణ్యరోదనైంది. గ్రామం నుంచి ఇరాక్‌కు వలసవెళ్లిన ఆరుగురి ని క్షేమంగా స్వగ్రామానికి చేరిస్తే రుణపడి ఉం టామని తమను పలకరించిన మీడియాను, అధికారులను, నాయకులను కాళ్లావేళ్లపడుతున్నారు.
 
 మెట్లకుంట గ్రామ పంచాయతీ పరిధిలో మెట్లకుంటతో పాటు లోతికుంట తండా, గుబ్బడితండా, మైసమ్మగ డ్డ తండా, భోజన్నగడ్డ తండా, బుర్రి తండా, డీ ప్లానాయక్ తండా, పూల్యనాయక్ తండా నివా స ప్రాంతాలున్నాయి. దాదాపు వెయ్యి కుటుం బాల వరకు ఉంటాయి. విదేశీ వలసల పరంప ర నలభై ఏళ్ల క్రితం ప్రారంభమైంది. నాటి నుం చి నేటి వరకు తాతలు, తండ్రులు, మనవళ్లు దాదాపు 800మందికి పైగా వలసవెళ్లిన వారు ఉన్నారు. కాగా ప్రస్తుతం వీరిలో విదేశాల్లో 600మంది ఉన్నారు.ప్రస్తుతం వలస వెళ్తోంది మూడోతరం (మనవళ్లు). నేటికీ విదేశీ వలస ను వారసత్వంగా పుచ్చుకొని బతుకుబండిని కొనసాగిస్తున్నారు. దుబాయ్, మస్కట్, దోహ (ఖతర్), బెహరాన్, సౌదీఅరేబియా, కువైట్, ఇరాన్, ఇరాక్ దేశాలకు వలస వెళుతుంటారు.
 రెండు నెలల క్రితమే: ఆరుగురు మెట్లకుంట వాసులు పాలెపల్లి చంద్రయ్య, పాలెపల్లి బాబ య్య, కొత్తకాపు జయవర్దన్‌రెడ్డి, గుండెవోని యా దయ్య, గొల్ల నర్సిములు, పిగుడు మల్లేశం లు కలిసి ఈ ఏడాది ఏప్రిల్ 14న ఇరాక్‌కు వెళ్లా రు. ఇతర దేశాల్లో కంటే ఇరాక్‌లో పనిచేస్తే ఎక్కువ వేతనం వస్తుందని అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ దేశంలోని నవాజ్ పట్టణంలోని అల్‌ఖలీజ్ అనే కన్స్‌ట్రక్షన్ కంపెనీ (భవననిర్మాణం)లో కూలీలు గా పనికి కుదిరారు. ఈ కంపెనీ యజమాని మిలిటెంట్లకు వ్యతిరేక వర్గానికి సంబంధించిన వ్యక్తి కావడంతో ఆయన కంపెనీ వదిలి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో ఆ కంపెనీలో పనిచేస్తున్న ఆరుగురు మెట్లకుంట వాసులతో పాటు 40 మంది ఆ పట్టణానికి దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో అడవి ప్రాంతంలో తల దాచుకున్నట్లు తెలుస్తోంది.
 
 వీరికి కనీసం మం చినీళ్లు కరువయ్యాయని నాలుగు రోజుల క్రి తం కేరళకు చెందిన ఓ వ్యక్తి ఫోన్ ద్వారా కు టుంబ సభ్యులకు సమాచారం అందింది. కనీ సం తిండి లేదని, బాంబుల కాలుష్యానికి తా గునీరు కూడా కలుషితమై మురికి నీళ్లు తాగుతున్నామని, ఆరోగ్యాలు పాడవుతున్నాయని, తమ క్షేమం గురించి ఆశలు వదులుకోవాలని చెప్పిన ట్లు కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇప్పటికే బాధిత కుటుంబసభ్యులను కలి సి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ధైర్యం చెప్పారు. బాధితులను స్వదేశానికి క్షేమంగా చేర్చేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన భరోసా ఇచ్చారు.
 
 తిండి తినబుద్ది కావడంలేదు
 నా కొడుకు రూ.1.50 లక్షలు ఖర్చు చేసి ఇరాక్‌కు రెండు నెలల క్రితం వలస వెళ్లాడు. అక్కడ బాంబులు వేయడం, తుపాకులతో కాల్చి చంపడం తెలుస్తుంటే నా కొడుకే చిన్న (జయవర్దన్‌రెడ్డి) గుర్తుకొస్తున్నాడు. ఇంట్లో అందరం ఏడుస్తున్నారు. తిండి తినాలనిపించడంలేదు. పొయ్యి రాజెయ్యలేదు.
 - మాణిక్యమ్మ, ఇరాక్ బాధితుని తల్లి, మెట్లకుంట
 
 ప్రభుత్వం చొరవ చూపాలి
 మా నాన్నతో పాటు గ్రామం నుంచి ఇరాక్‌కు వెళ్లిన ఆరుగురిని క్షేమంగా ఇంటికి చేర్చేందుకు ప్రభుత్వం చొరవ చూపాలి. ఇరాక్‌లో అల్లర్ల కారణంగా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న మావాళ్లను విడిపించాలి. వారం రోజుల నుంచి మా ఆందోళనను ఎవరికి చెప్పుకోవాలో తోచడం లేదు.
 - మొగులమ్మ, ఇరాక్ బాధితుని కూతురు, మెట్లకుంట
 

>
మరిన్ని వార్తలు