'తెలంగాణలోను పార్టీనీ బలోపేతం చేస్తాం'

12 Mar, 2020 14:48 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అమీర్‌పేటలో పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌ రెడ్డి పార్టీ జెండాను ఆవిస్కరించి కేక్‌ను కట్‌చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. నాడు ఢిల్లీ కాంగ్రెస్‌ పెద్దలు, చంద్రబాబు కుమ్మక్కై వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఇబ్బందులకు గురిచేశారు. దీంతో ఆయన కాంగ్రెస్‌ నుంచి బయటికి వచ్చి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని స్థాపించారని పేర్కొన్నారు.  ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఏపీ వ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్ర చేసి వారి సమస్యలను పరిష్కరించడమే ఎజెండాగా మేనిఫెస్టో రూపొందించారు. అనంతరం జరిగిన ఎన్నికలలో పార్టీ అఖండ విజయం సాధించిందని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తామన్నారు. కార్యకర్తలు మనోధైర్యంతో ఉండాలని, త్వరలో ఇక్కడ కూడా మంచి రోజులు వస్తాయని వెల్లడించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా