11 గంటలు@ వందేళ్లు

22 Oct, 2015 02:08 IST|Sakshi
11 గంటలు@ వందేళ్లు

న్యూయార్క్: వృత్తిజీవితంలో ఎన్నో ఏళ్లు పనిచేశాం. ఇక  విశ్రాంతి తీసుకుందాం అని అనుకుంటున్నారా? అలాంటి వారు ఈ బామ్మ తెలుసుకోవాల్సిందే. వందేళ్లు దాటినా చలాకీగా ఉండే ఈ బామ్మ పేరు ఫెలిమినా రొటుండే. ఈ ఏడాది ఆగస్ట్‌లో ఈవిడ తన వందో పుట్టినరోజు జరుపుకుంది. 50 ఏళ్లు పూర్తయిన వాళ్లలో చాలా మంది రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తారు. కానీ, ఈ బామ్మ శతాయుష్షులోనూ పనిచేస్తోంది. అమెరికాలోని బఫెలో నగరంలోని ఓ లాండ్రీ షాపులో పనిచేస్తోంది.

పని అంటే అల్లాటప్పా పని కాదు. రోజుకు ఏకబిగిన 11 గంటల పని. బట్టలు ఉతకడం, డ్రైక్లీనింగ్ పనులు బామ్మ చకచక చేసేస్తుంది. ఉదయం ఏడుగంటలకు పని మొదలుపెడితే సాయంత్రంఆరింటికి ముగుస్తుంది. ‘15 ఏళ్లప్పుడు పనిలో చేరా. నా ఉద్దేశంలో అనారోగ్యం వస్తేనే 75ఏళ్లకు రిటైర్ కావాలి. ఆరోగ్యంగా ఉంటే జీవితాంతం పనిచేస్తూ ఉండాలి’ అంటోంది బామ్మ.

మరిన్ని వార్తలు