నలుగురిని మింగిన గోదారి

3 Aug, 2013 04:46 IST|Sakshi

చెన్నూర్, న్యూస్‌లైన్ : ఉగ్ర గోదావరి నలుగురిని పొట్టన పెట్టుకుంది. కర్మకాండకు వెళ్లిన నలుగురు గోదావరి వరదలో కలిసిపోయారు. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో జలర్లు కూ డా గాలింపు చర్యలకు వెనకంజ వేస్తున్నారు. చెన్నూర్ పట్టణంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన తగరం చొక్కమ్మ మృతి చెందిం ది. శుక్రవారం మూడో రోజు కావడంతో కుటుంబ సభ్యులు, బం ధువులు కర్మకాండ చేయడానికి గోదావరి నదికి చేరుకున్నారు. సంప్రదాయం ప్రకారం కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత గోదావరిలో స్నానాలు చేయడానికి వెళ్లారు. స్నానాలు చేయడానికి సిద్ధం అవుతుండగా తగరం శంకర్ పాదరక్షలు గోదావరిలో పడిపోయాయి. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నా, పాదరక్షలు తీసే ప్రయత్నం చేయడంతో శంకర్ వరద ఉధృతికి కొట్టుకుపోయాడు. అతడిని కాపాడేందుకు ఆయన తమ్ముడు రవి, చిన్నమ్మ రాజుబాయి, చిన్నమ్మ కోడుకు వెంకటస్వామి, చిన్న తమ్ముడు సుందర్ ఒకరి తర్వాత ఒకరు గోదావరిలో దిగి ప్రయత్నించారు. ఇందులో సుందర్ కొంత దూరం వదర ప్రవాహనికి కొట్టుకుని పోయి చెట్టును పట్టుకొని బతికి బయటపడ్డాడు. మడుగులో చిక్కుకుని శంకర్(42), రవి(25), రాజుబాయి(52), వెంకటస్వామి(35) పవాహానికి కొట్టుకుపోయి గల్లంతయ్యారు. కాగా జాలర్లను వేమనపల్లి నుంచి రప్పించి సాయత్రం గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి అవడంతో ఆపేశారు. మంచిర్యాల డీఎస్పీ రమణకుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
 
 కుటుంబాల్లో విషాదం
 ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గోదావరిలో గల్లంతు కావడంతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. శంకర్, వెంకటస్వామి చెన్నూర్‌లో హమాలీ పని చేస్తుంటారు. రవి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తాడు. శంకర్, రవిలకు ఒక్కో కుమారులు, భార్యలు తల్లి ఉన్నారు. వెంకటస్వామికి వివాహం కాలేదు. అందరితో కలసి మేలసి ఉండే ఈ అన్నదమ్ములు ఒకేసారి మృతిచెందడంతో అంబేద్కర్ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలానికి సీఐ భద్రయ్య, మంచిర్యాల ఫైర్ సిబ్బంది సందర్శించారు. గోదావరి నది ఉధృతంగా ప్రవహించడంతో జాలర్లు గాలింపు చర్యలు చేపట్టేందుకు వెనకంజ వేశారు. దీంతో సీఐ గాలింపు కోసం వేమనపల్లి మండలం నుంచి నాటు పడువలు తెప్పించేందుకు చర్యలు చేపట్టారు. కాగా, పాదరక్షలే నా కొడుకు ప్రాణం తీశాయంటూ, గంగలో దిగాకపోతే నా కొడుకు శంకర్ బతికే వాడని ఆ ఆలోచన ఎందుకు రాలేదని మృతుని తల్లి పోసక్క, బంధువులు రోదించిన తీరు అందరిని కంటతడి పెట్టించాయి.

మరిన్ని వార్తలు