ప్రతికూల వాతావరణమే ముంచింది!

4 Jan, 2015 22:43 IST|Sakshi
ఎయిర్ ఆసియా విమానం(ఫైల్)

జకార్తా: ప్రతికూల వాతావరణం కారణంగానే ఎయిర్ ఆసియా విమానం కూలిపోయిందని ఇండోనేసియా వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ భయానక ఘటన గల కారణాన్ని ఇండోనేసియా తొలిసారి అధికారికంగా ప్రకటించింది. విమానం అదృశ్యమవడానికి ముందున్న సమాచారం ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చింది. ప్రతికూల వాతారణ ప్రభావం విమాన ఇంజిన్ పై పడడంతో ప్రమాదం జరిగివుండొచ్చని ఇండోనేసియా మెటరాలజీ, క్లైమటాలజీ, జియోఫిజిక్స్ ఏజెన్సీ(బీఎంకేజీ) పేర్కొంది.

కాగా, జావా సముద్రం నుంచి ఆదివారం నాలుగు మృతదేహాలు వెలికితీశారు. ఇప్పటివరకు 34 మృతదేహాలు వెలికితీశారు. గత ఆదివారం నుంచి ఇండోనేసియాలోని సురయ నుంచి 162 మందితో సింగపూర్ వెళుతూ ఎయిర్ ఆసియా విమానం జావా సముద్రంలో కూలిపోయిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు