అశోక్ లేలాండ్ అదరహా!

27 Jan, 2017 12:58 IST|Sakshi
అశోక్ లేలాండ్ అదరహా!

ముంబై: డీమానిటైజేషన్ ప్రభావం ఉన్నప్పటికీ   హెవీ కమర్షియల్ వెహికల్స్  తయారీ  సంస్థ అశోక్ లేలాండ్  మెరుగైన  ఫలితాలను  నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో రికార్డు ఆదాయాన్ని, నికర లాబాలను రిపోర్టు చేసింది.  వాల్యూమ్స్ లో కూడా వేగం బాగా పుంజుకున్న ఈ హిందుజా ఫ్లాగ్ షిప్ అశోక్ లేలాండ్ నికర లాభం రూ.185. 88కోట్లను ఆర్జించింది.   రూ 4.723 కోట్ల అమ్మకాలపై ఈ లాభాలను నమోదుచేసింది. గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ రూ నికర లాభం రూ.213. 70 కోట్లగా వుంది.

ఈ త్రైమాసికంలో అశోక్ లేలాండ్ రికార్డు వాల్యూమ్లను పోస్ట్ చేసింది.  మీడియం అండ్ హెవీ కమర్షియల్ వాహనాల అమ్మకాలు25,285  యూనిట్లుగా నిలిచాయి.   ఈ త్రైమాసికంలో మెటీరయల్ కాస్ట్ బాగా పెరగడం సవాల్ గా  మారిందని అశోక్  లేలాండ్ ఎండీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్,  వినోద్ కె దాసరి తెలిపారు. డీమానిటైజేషన్ ప్రభావం ఉన్నప్పటికీ, ఇపుడిపుడే పరిశ్రమ కోలుకుంటోందన్నారు. 

ఆరోగ్యకరమైన ఆపరేటింగ్ మార్జిన్లు నిర్వహణ తరువాతి  క్వార్టర్ లో చాలా సానుకూల ప్రభావం చూపిస్తుందని భావిస్తున్నామన్నారు. భారీ వాణిజ్య వాహనాల  డిమాండ్  పుంజుకుంటుందన్న అంచనాల నేపథ్యంలో  అశోక్ లేలాండ్ పాజిటివ్ గా ఉందనుందని  ఐడిబిఐ క్యాపిటల్ మార్కెట్ & సెక్యూరిటీస్  హెడ్ ఎకె ప్రభాకర్  చెప్పారు. దీంతో నేటి మార్కెట్లో 7.16  శాతం వృద్ధిని సాధించి  నిఫ్టీని అధిగమించింది.

మరిన్ని వార్తలు