మణిపూర్ సీఎం నివాసం సమీపంలో బాంబు పేలుడు

29 Oct, 2013 10:37 IST|Sakshi

మణిపూర్ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబి సింగ్ అధికార నివాసానికి కూతవేటు దూరంలో మంగళవారం ఉదయం 6 గంటలకు శక్తివంతమైన బాంబు పేలింది. ఆ ఘటనలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. మణిపూర్ రాజధాని ఇంఫాల్లోని సీఎం నివాసానికి అత్యంత సమీపంలోని కవైర్రాంబండ మార్కెట్ కాంప్లెక్ సమీపంలోని బిరొడన్ స్కూల్ వద్ద ఆ బాంబు విస్ఫోటం సంభవించింది.

 

సీఎం నివాసం సమీపంలో బాంబు పేలుడుతో పోలీసులు అప్రమత్తమైయ్యారు. అడుగడుగున తనిఖీలు చేపట్టారు. అయితే తీవ్రవాదులు ఆ బాంబును అమర్చార లేక విసిరార అనేది ఇంకా తెలియలేదని పోలీసులు వెల్లడించారు. అలాగే ఆ బాంబు పేలుడుకు తామే బాధ్యుల మంటూ ఇంతవరకు ఎవరు ప్రకటించలేదు. గత ఆగస్టులో కూడా సీఎం ఓక్రమ్ ఇబోబి సింగ్ ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని ఆయన నివాస ప్రాంగణం ఎదుట బాంబు పేలిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఘటనలో కూడా  ఎవరు గాయపడలేదు.

Read latest Top-news News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు