‘అసహనం’తో దేశానికి మచ్చ

1 Nov, 2015 08:12 IST|Sakshi
‘అసహనం’తో దేశానికి మచ్చ

ఢిల్లీ భేటీలో ప్రముఖుల వ్యాఖ్య
 
న్యూఢిల్లీ: భారత్‌లో ‘అసహన’ ఘటనలు దేశ సమైక్యతకు చెడ్డపేరు తెస్తాయని రచయితలు, కళాకారులు అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై శనివారం ఢిల్లీ జరిగిన ఓ భేటీలో వారు మాట్లాడారు. పరిస్థితిలో మార్పు రాకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం లేదని అన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పుకునే భారత్‌లో రచయితలకు భావ ప్రకటనా స్వేచ్ఛ ఉండాలని, దాడులు చేస్తున్న వారిని కట్టడి చేయలేకపోతే అది నియంతృత్వమే అవుతుందని సంగీత విద్వాంసుడు జుబిన్ మెహతా అన్నారు.  ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ, ‘మైనారిటీల్లో అభద్రత నెలకొంది. వారికి భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే’నన్నారు. ఢిల్లీ ఐఐటీలో ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ మాట్లాడుతూ.. సహనం, పరస్పరం గౌరవంతో మార్పు తీసుకురాగలమన్నారు.

విచ్ఛిన్నకర శక్తులతో దేశ ఐక్యతకు ప్రమాదం పొంచి ఉందని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ అన్నారు. ప్రముఖ గాంధేయవాది పీవీ రాజగోపాల్‌కు ఇందిరాగాంధీ జాతీయ సమగ్రతా అవార్డును ప్రదానం చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లడారు.

మరిన్ని వార్తలు