అతిపెద్ద గూండా ఎవరో తేల్చుకుందాం: కట్జూ

20 Oct, 2016 12:27 IST|Sakshi
అతిపెద్ద గూండా ఎవరో తేల్చుకుందాం: కట్జూ
ముంబై : పాకిస్తానీ యాక్టర్లను భారత్లో నిషేధించడంపై తీవ్ర చర్చ రేగుతున్న నేపథ్యంలో మాజీ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ మార్కండేయ కట్జూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరణ్ జోహార్ అప్కమింగ్ ఫిల్మ్ యే దిల్ హే ముస్కిల్ విడుదలను నిలిపివేయడంపై మహరాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్)ను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యానించారు."నిస్సహాయంపు ఆర్టిస్టులపై ఎంఎన్ఎస్ ఎందుకు దాడిచేస్తుంది? ఒకవేళ ధైర్యముంటే నా ముందుకు రండి. మీ అసహనానికి నా దగ్గర దండన ఉంది. మీ కోసమే ఈ దండన వేచిచూస్తున్నట్టు" బుధవారం పలు ట్వీట్లు చేశారు. ఎంఎన్ఎస్ ప్రజలు అరేబియన్ సముద్రపు ఉప్పు నీరు తాగే గూండాలని వ్యాఖ్యానించారు. గంగా, యమునా, సరస్వతి త్రివేణి సంగమం పవిత్రమైన నీరు తాగే తాను అలహాబాదీ గూండానని పేర్కొన్నారు.
 
తన ముందుకు వస్తే ఎవరు అతిపెద్ద గూండానో తేల్చుకుందామని సవాలు విసిరారు. ఒక్క ఎంఎల్ఏ పార్టీ ఎంఎన్ఎస్ వారి పాఠాలను వారే నేర్చుకోలేకపోతున్నారన్నారు.వచ్చే ఎన్నికల్లో జీరో-ఎంఎల్ఏ పార్టీగా ఎంఎన్ఎస్ నిలుస్తుందని ట్వీట్ చేశారు. కట్జూ వ్యాఖ్యలపై ఎంఎన్ఎస్ వైస్ ప్రెసిడెంట్ వాగీశ్ సారస్వత్ మండిపడ్డారు. కనీసం మాకు ఒక్క ఎంఎల్ఏనైనా ఉన్నారని, అయినా కట్జూ ఏ ఆధారాలతో ఇలా వ్యాఖ్యానిస్తున్నారని ప్రశ్నించారు.   ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు అధినేతగా ఉన్న కట్జూ ఇప్పటికే పలు అంశాలపై తీవ్రంగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. పాకిస్తానీ యాక్టర్ ఫవాద్ ఖాన్ నటించిన కరణ్ జోహార్ సినిమా యే దిల్ హై ముస్కిల్ వచ్చే శుక్రవారం విడుదల కాబోతుంది. కానీ ఆ సినిమా విడుదలను  నిలిపివేశారు. జోహార్ ఫిల్మ్ను నిలిపివేయడంపై ఎంఎన్ఎస్కు మాజీ ఇండియన్ క్రికెటర్, కామెంటర్ సంజయ్ మంజ్రేకర్ అంత మంచికాదంటూ బెదిరించారు.         
>
మరిన్ని వార్తలు