నైరోబిలో కొనసాగుతున్న కాల్పులు

23 Sep, 2013 15:18 IST|Sakshi

నైరోబిలో ఉగ్రవాదులు, భద్రత దళాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. షాపింగ్ మాల్లో ఉగ్రవాదుల చెరలో బందీలుగా ఉన్న వారిని విడిపించేందుకు కెన్యా భద్రత దళాలు  పోరాడుతున్నాయి. ఉగ్రవాది దాడిలో మరణించిన వారి సంఖ్య 69 మందికి పెరిగింది. దాడి జరిగిన తర్వాత మూడో రోజు సోమవారమూ ఉగ్రవాదులకు, సైన్యానికి భీకర పోరు సాగుతోంది. సైనికులు షాపింగ్ కాంప్లెక్స్ను నలువైపులా చుట్టుముట్టాయి.  

సొమాలి షెబాబ్ తిరుగుబాటుదారులతో సంబంధాలున్న అల్ ఖైయిదా ఉగ్రవాదులు ఈ దాడిలో పాల్గొన్నారు. బందీలకు ఎలంటి హానీ జరగకుండా ప్రాణాలతో కాపాడేందకు ప్రయత్నిస్తున్నామని సైనికాధికారులు తెలిపారు. ఇదిలావుండగా, సాయం చేసేందుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సుముఖత వ్యక్తం చేశారు. కెన్యా అధ్యక్షుడికి ఈ విషయాన్ని తెలియజేశారు.

మరిన్ని వార్తలు