అద్వానీ, జోషిలకు మోడీ ఝలక్

26 Aug, 2014 16:14 IST|Sakshi
అద్వానీ, జోషిలకు మోడీ ఝలక్

న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నాయకులు ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషిలకు నరేంద్ర మోడీ ఝలక్ ఇచ్చారు. పార్టీలో అత్యున్నత నిర్ణాయక మండలి బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి అద్వానీ, జోషీలకు ఉద్వాసనకు పలికారు. సెంట్రల్ ఎలక్షన్‌ కమిటీ నుంచి కూడా వృద్ధ నేతలను తప్పించారు. వీరి స్థానంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్, ప్రధాన కార్యదర్శి జేపీ నద్దాలను తీసుకున్నారు.

అయితే కొత్తగా మార్గదర్శక మండలి ఏర్పాటు చేయనున్నట్టు బీజేపీ ప్రకటించింది. ఇందులో అద్వానీ, జోషీలకు స్థానం కల్పించారు. వీరితో పాటు వాజపేయి, రాజ్నాథ్ సింగ్, నరేంద్ర మోడీ కూడా ఉంటారని బీజేపీ వెల్లడించింది.

పార్లమెంటరీ బోర్డు పునర్వ్యస్థీకరణతో పార్టీపై నరేంద్ర మోడీ పూర్తి పట్టు సాధించినట్టయింది. ఇంతకుముందే తన సన్నిహితుడు అమిత్ షాకు బీజేపీ అధ్యక్ష పీఠంపై కూర్చుబెట్టిన మోడీ ఇప్పుడు తనతో అంటిముట్టనట్టుగా వ్యవరిస్తున్న కురువృద్ధులను పార్లమెంటరీ బోర్డు నుంచి సాగనంపారు. 

మరిన్ని వార్తలు