లెనోవో చేతికి ఐబీఎం సర్వర్ వ్యాపారం

24 Jan, 2014 02:07 IST|Sakshi

 న్యూయార్క్: టెక్నాలజీ దిగ్గజం ఐబీఎంకు చెందిన దిగువస్థాయి సర్వర్ బిజినెస్‌ను (ఎక్స్86) పీసీ తయారీ దిగ్గజం లెనోవో కొనుగోలు చేయనుంది. ఈ విషయమై ఉభయుల మధ్యా వెనక్కి తగ్గటానికి వీల్లేని ఒప్పందం కుదిరింది. డీల్ విలువ 230 కోట్ల డాలర్లు (సుమారు రూ. 14,000 కోట్లు) కాగా, టెక్నాలజీ విభాగంలో ఒక చైనీస్ కంపెనీ చేపట్టిన అతిపెద్ద కొనుగోలు ఇదే. దీనిలో భాగంగా ఐబీఎంకు 200 కోట్ల డాలర్లను నగదు రూపంలో లెనోవో చెల్లిస్తుంది. మిగిలిన మొత్తానికి వాటాలను కేటాయిస్తుంది. దీన్ని రెండు కంపెనీలూ సంయుక్తంగా ప్రకటించాయి. ఒప్పందం ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఐబీఎంకు సర్వర్ విభాగంలో ఉన్న 7,500 మంది ఉద్యోగులు లెనోవోకు బదిలీ అవుతారు. 2005లో ఐబీఎంకు చెందిన పీసీ బిజినెస్‌ను సైతం లెనోవో సొంతం చేసుకోవటం తెలిసిందే. కొనుగోలులో భాగంగా థింక్‌ప్యాడ్ పీసీ విభాగాన్ని సైతం దక్కించుకుంది.
 

మరిన్ని వార్తలు