ముగ్గురు జాలర్లకు జాక్ పాట్

6 Nov, 2016 22:27 IST|Sakshi
ముగ్గురు జాలర్లకు జాక్ పాట్

దుబాయ్: ఒమన్ కు చెందిన ముగ్గురు జాలర్లు జాక్ పాట్ కొట్టారు. కురాయత్ ప్రావిన్సు సమీపంలో గత వారం వేటకు వెళ్లిన వారికి సముద్రపు నీటిలో కొట్టుకెళ్తున్న అత్యంత అరుదైన తిమింగలపు శుక్ర కణం వారి దొరికినట్లు ఖలీద్ అల్ సినాని అనే జాలరి చెప్పాడు.

తిమింగలాల శుక్ర కణాలను ప్రత్యేక పర్ ఫ్యూమ్ ల తయారీలో వినియోగిస్తారు. చేపల వేటకు వెళ్లిన సమయంలో పెద్ద ఎత్తున దుర్వాసన వస్తుండటంతో అటువైపుగా వెళ్లామని సినాని చెప్పాడు. కొట్టుకెళ్తున్న తిమింగలపు శుక్ర కణాన్ని తన సహచరుల సాయంతో తాడుకు కట్టి బోటులోకి ఎక్కించుకున్నట్లు తెలిపాడు. ఆ తర్వాత అమితానందంతో ఒడ్డుకు వచ్చినట్లు చెప్పాడు.

మొదటి రెండు రోజుల పాటు దుర్వాసనను వెదజల్లిన శుక్ర కణం ఆ తర్వాత సువాసన ఇవ్వడం మొదలు పెట్టిందని తెలిపాడు. నిపుణులతో పరిశీలించని తర్వాత శుక్ర కణాన్ని చిన్న ముక్కలుగా కత్తిరించి ఎండబెట్టినట్లు చెప్పాడు. కాగా, 18 కిలోల బరువు గల శుక్రకణం విలువ దాదాపు 2.5 మిలియన్ డాలర్లు పలికే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు