సబ్సిడీ భారం తగ్గకుంటే ఇబ్బందులే: ఓఎన్‌జీసీ

27 Nov, 2013 01:58 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇంధన విక్రయాలకు సంబంధించి తమపై పడుతున్న సబ్సిడీ భారం పెరుగుతుండటంతో ఉత్పత్తిపైనా, విదేశీ కొనుగోళ్లపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని ప్రభుత్వ రంగ ఆయిల్ దిగ్గజం ఓఎన్‌జీసీ పేర్కొంది. ఈ మేరకు ఆయిల్ శాఖకు రాసిన లేఖలో సబ్సిడీ డి స్కౌంట్ల తరువాత లభిస్తున్న నికర ధర క్షీణిస్తున్నదని వివరించింది. పెట్రో ఉత్పత్తులను విక్రయించే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు వాటిల్లే ఆదాయ నష్టాలను చమురు, గ్యాస్ ఉత్పత్తి సంస్థలైన ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియా తదితరాలు సబ్సిడీ రూపంలో కొంతమేర భరించే సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు