కేట్ టాప్లెస్ ఫొటోలు: జర్నలిస్టులపై విచారణ

26 Oct, 2016 12:55 IST|Sakshi
కేట్ టాప్లెస్ ఫొటోలు: జర్నలిస్టులపై విచారణ

పారిస్: సంచలనం రేపిన బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్ టాప్లెస్ ఫొటోల వ్యవహారంలో ఫ్రెంచ్ కోర్టు విచారణను వేగవంతం చేసింది. రహస్యంగా ఫొటోలు తీయడమేకాక, వాటిని పత్రికల మొదటి పేజీలో ప్రచురించి బ్రిటన్ రాచకుటుంబం పరువు తీశారన్న కేట్ తరఫు న్యాయవాదుల వాదనకు కోర్టు మొగ్గుచూపింది. దీంతో కేట్ ఫొటోలను ప్రచురించిన క్లోజర్ మ్యాగజీన్ కు చెందిన ఆరుగురు జర్నలిస్టులపై విచారణకు రంగం సిద్ధమైంది. ఏడాది జనవరి నుంచి విచారణ జరగనున్నట్లు ఫ్రెంచ్ న్యాయ శాఖ వర్గాలు మంగళవారం మీడియాకు తెలిపాయి.

కేట్ మిడిల్టన్ ..భర్త ప్రిన్స్ విలియమ్స్తో కలిసి హాలిడే కోసం ఫ్రాన్స్లోని లా ఫ్రావిన్స్కు వెళ్లింది. అక్కడ మూడో మనిషి అడుగుపెట్టే అవకాశంలేని భవంతి పోర్టికోలో కేట్, విలియంలు చనువుగా ఉన్న సమయంలో క్లోజర్ మ్యాగజీన్ కు చెందిన జర్నలిస్టులు రహస్యంగా ఫొటోలు తీశారు. మరుసటి రోజే భారీ హెడ్డింగ్ లతో కేట్ టాప్ లెస్ ఫొటోలు కవర్ పేజీగా మ్యాగజీన్ ను మార్కెట్ లోకి విడుదల చేశారు.

2012లో జరిగిన ఈ ఘటనపై బ్రిటన్ రాచకుటుంబం భగ్గునమండింది. ఫ్రెంచ్ ఉన్నతాధికారులతో మాట్లాడి సదరు పత్రికపై దావా వసింది. నాలుగేళ్ల విచారణలో.. మొత్తం ఆరుగురు నిందితులుగా తేలారు. మ్యాగజీన్ ఎడిటర్, ఓ సీనియర్ జర్నలిస్ట్, ఇద్దరు ఫొటో జర్నలిస్టులు, మరో ఇద్దరు ఫ్రీలాన్స్ ఫొటోజర్నలిస్టులపై వచ్చే ఏడాది నుంచి విచారణ జరగనుంది. కేట్ అత్త, దివంగత ప్రినెన్స్ డయానా మీడియా నుంచి తప్పించుకునే క్రమంలో మరణించారని కొందరి వాదన.

ఫ్రాన్స్ లో కేట్, విలియమ్ విడిదిచేసిన ఫాంహౌస్ ఇదే

మరిన్ని వార్తలు