చోరీకి గురైన 10 కోట్ల బంగారం స్వాధీనం

26 Oct, 2013 13:24 IST|Sakshi
చోరీకి గురైన 10 కోట్ల బంగారం స్వాధీనం

జార్ఖాండ్లోని రాంచీ నగరంలో ఇటీవల నగల దుకాణంలో చోరీకి గురైన రూ.12 కోట్ల విలువైన బంగారంలో రూ.10 కోట్ల బంగారాన్ని గత రాత్రి స్వాధీనం చేసుకున్నామని నగర పోలీసు ఉన్నతాధికారి శనివారం ఇక్కడ వెల్లడించారు. పోలీసు బృందాలు తనిఖీల్లో భాగంగా దుకాణంపై భాగంలోని వాటర్ ట్యాంక్లో చోరీ అయిన బంగారాన్ని కనుగొన్నారని తెలిపారు.

 

దొంగలు తాము చోరీ చేసిన బంగారాన్ని వాటర్ ట్యాంక్లో దాచి, పోలీసుల దర్యాప్తు సద్దుమణిగిన తర్వాత ఆ మొత్తం బంగారాన్ని అక్కడి నుంచి తలించాలని దొంగలు పథకం వేసి ఉంటారని పోలీసు ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. అయితే ఆ కేసులో ఇప్పటికి ఎవరిని అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు. అలాగే దర్యాప్తును మాత్రం మరింత ముమ్మరం చేసినట్లు వివరించారు. దోపిడికి పాల్పడిన దుండగులను సాధ్యమైనంత త్వరగా అరెస్ట్ చేస్తామని పోలీసు ఉన్నతాధికారి ధీమా వ్యక్తం చేశారు. 

 

రాంచీ నగరంలోని ఆనంద్ జ్యువెలరీ దుకాణాన్ని ఈ నెల 12 నుంచి 14 వరకు దసర పండగ సందర్బంగా మూసి ఉంచారు. అయితే 15వ తేదీ ఉదయం దుకాణాన్ని ఎప్పటిలాగా తెరిచారు. దుకాణంలో నగలన్నీ మాయం కావడం చూసి యజమాని చోరీ జరిగిందని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా పోలీసులు ముమ్మర  తనిఖీలు చేపట్టారు. చోరీకి పాల్పడిన దొంగల దుకాణంలోని సీసీ కెమెరాలను కూడా ఎత్తుకెళ్లారని పోలీసులు తెలిపారు. అందువల్ల కేసు కొంత ఆలస్యంమైందని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు