రూ. 88 లక్షలు పలికిన మెనూ కార్డు

2 Oct, 2015 13:12 IST|Sakshi
రూ. 88 లక్షలు పలికిన మెనూ కార్డు

న్యూయార్క్: 'టైటానిక్' లంచ్ మెనూ కార్డు ఒకటి భారీ ధరకు అమ్ముడు పోయింది. లియన్ హార్ట్ ఆటోగ్రాఫ్స్ నిర్వహించిన ఆన్ లైన్ వేలంలో దాదాపు రూ. 88 లక్షలు పలికింది. ముందుగా ఊహించిన దానికంటే ఎక్కువ ధర పలకడం విశేషం. టైటానిక్ ఓడలో ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించిన  అబ్రహం లింకన్ సాల్మన్ అనే వ్యక్తి దీన్ని భద్రపరిచాడని లియన్ హార్ట్ ఆటోగ్రాఫ్స్ తెలిపింది.

దీనిపై 1912, ఏప్రిల్ 14 తేదీ స్టాంపుతోపాటు వైట్ స్టార్ లినె లోగో ఉంది. గ్రిల్లెడ్ మటన్ చాప్స్, కస్టర్డ్ పుడ్డింగ్, కార్నెడ్ బీఫ్, బ్యాకెడ్ జాకెట్ పొటాటోస్, బఫెట్ ఆఫ్ ఫిష్, హామ్ అండ్ బీఫ్, యాపిల్ పెస్ట్రీతో పాటు 8 రకాల చీజ్ ఐటెమ్స్ వివరాలు మెనూలో ఉన్నాయి. 3 లేదా 4 టైటానిక్ మెనూ కార్డులు మాత్రమే ప్రస్తుతం మనుగడలో ఉన్నాయి. టైటానిక్ ప్రమాదం నుంచి బయట పడిన వారు వీటిని భద్రపరిచారు.

అట్లాంటిక్ మహా సముద్రంలో మంచు పర్వతాన్ని ఢీకొని టైటానిక్ ఓడ మునిగిపోయింది. 1912, ఏప్రిల్ 15న జరిగిన ఈ దుర్ఘటనలో 1500 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.

మరిన్ని వార్తలు