పోలీసుల అదుపులో మేథాపాట్కర్‌

11 Jun, 2017 19:47 IST|Sakshi

మంద్‌సౌర్‌: మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌ మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న సామాజిక కార్యకర్తలు మేథాపాట్కర్‌, స్వామి అగ్నివేశ్‌‌, స్వరాజ్‌ ఇండియా చీఫ్‌ యోగేంద్ర యాదవ్‌ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గిట్టుబాటు ధరలు కల్పించాలని, రుణ మాఫీ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేసిన రైతులపై పోలీసులు కాల్పులు జరపడంతో ఐదుగురు రైతులు మృతిచెందారు. మృతుల కుటుంబాలను కలిసేందుకు వస్తుండగా మంద్‌సౌర్‌ బయట ధోల్‌దార్‌ టోల్‌ప్లాజా వద్ద పోలీసులు వీరిని అడ్డుకున్నారు.

శనివారం కర్ఫ్యూ ఎత్తివేసినందున ఇపుడిపుడే పరిస్థితులు కుదుటపడుతున్నాయని, ఇపుడు వీరి పర్యటన వల్ల శాంతికి విఘాతం కలిగే ప్రమాదముందని పోలీసులు పేర్కొన్నారు. నిషేధాజ్ఞలు ఉన్నందున అక్కడికి వెళ్లడానికి వీల్లేదని వీరిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మాహౌ-నీముచ్‌ జాతీయ రహదారిపై వారు బైఠాయించారు. వీరితో పాటు మరో 30మందిని పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు.

మరిన్ని వార్తలు