అంతర పంట లాభదాయకం

6 Nov, 2014 03:44 IST|Sakshi

వలేటివారిపాలెం : సపోట, మామి డి, జామ పండ్ల తోటల్లో కూరగాయలు, మినుమును అంతర పంటలుగా సాగు చేస్తూ రైతులు లాభాలు గడిస్తున్నారు. ప్రస్తుతం వలేటివారిపాలెం మండలంలో పలువురు రైతులు మినుము, దొండ, బెండ, కాకర, దోస, చిక్కుడు, వంగ, గోంగూర, తోటకూర, పాలకూరను రైతులు అంతర పంటలుగా సాగు చేస్తున్నారు.

పండ్ల తోటల్లో అంతర పంటలు సాగు చేసినా, చేయకపోయినా దుక్కి, కలుపు నివారణ చర్యలు చేపట్టాలి. ఇందుకుగాను ఏడాదికి రూ.7 వేలు ఖర్చు చేయాలి. అంతర పంటలు సాగు చేసినా అదే ఖర్చు అవుతుంది. పండ్ల తోటలో కూరగాయలు, మినుము పంట లను సాగు చేస్తే వాటికి వాడే మందులు పండ్ల తోటలకు కూడా ఉపయోగపడతాయి.

పండ్ల తోటల్లో సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సిన పని ఉండదు. పైగా పండ్ల మొక్కలు త్వరితగతిన పెరగడానికి అవకాశం ఉంటుంది. కూరగాయల సాగుకు మూడు నెలలు శ్రమిస్తే ఆ తర్వాత మూడు నెలలపాటు పంటను కోసి విక్రయించుకోవచ్చు. పండ్ల తోటల్లో అంతర పంటలను ఆరేళ్లపాటు సాగు చేసుకోవచ్చు. పండ్ల మొక్కలు ఎదిగిన త ర్వాత అంతర పంటలు సాగు చేయడం అంత శ్రేయస్కరం కాదు.

మరిన్ని వార్తలు