బోడో మిశ్రమంతో క్రిమికీటకాలు దూరం

5 Nov, 2014 01:04 IST|Sakshi

 కొండాపూర్: క్రిమికీటకాలు, పురుగులు మామిడి చెట్లపైకి వెళ్లకుండా ఉండాలంటే మొదళ్లకు బోడో పేస్ట్ మిశ్రమాన్ని పూయాలని రావేఫ్ విద్యార్థులు రైతులకు సూచించారు. మండల పరిధిలోని మల్కాపూర్‌లో కౌలు రైతు శ్రీనివాస్ పొలంలో మంగళవారం అన్నదాతలకు పలు సలహాలు అందజేశారు.  
 బోడో మిక్చర్ తయారీ విధానం..
 కిలో కాపర్ సల్ఫేట్‌లో 10 లీటర్ల నీళ్లు పోసి కేసీ సున్నం వేసి కలిపితే బోడో మిక్చర్ తయారవుతుంది. దీన్ని చెట్ల మొదళ్లకు, కొమ్మలకు పూయడం వల్ల చీమలు, కీటకాలు, పురుగుల నుంచి రక్షించుకోవచ్చని తెలిపారు. పిండి నల్లులు, పండు ఈగలు చెట్లపై వాలకుండా ఉండాలనుకుంటే కొమ్మలకు లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థులు అఖిలాండేశ్వరి, శ్రీవర్ధ, లిఖిత, దివ్య, శైలజ, అల్ఫియా, సుస్మితారెడ్డి, అసా సుష్మ, పూర్ణిమ, జఫీలా, సింధు, మేఘన, నిస్సీ, ఫెమి, వర్షారెడ్డితో పాటు గ్రామ రైతులు నారాయణ, పాపయ్య, చంద్రకళ, చెంద్రయ్య, కిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు