బలవంతంగా ఆటోలో ఎక్కించి.. వివాహితపై కిరాతకంగా..

9 Nov, 2023 08:10 IST|Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: వివాహితను వేధించిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై దుబ్బక సునీల్‌ తెలిపారు. ఎస్సై వివరాల ప్రకారం... మహారాష్ట్రకు చెందిన ఓ వివాహిత (30) తమ బంధువులుంటున్న అందర్‌బంద్‌ గ్రామానికి వెళ్లడానికి ఆదిలాబాద్‌ బస్టాండ్‌కు వచ్చింది. అక్కడి నుంచి ఇంద్రవెల్లి మండలంలోని దుర్వగూడ గ్రామానికి చెందిన పుసం హరిక్రిష్ణ, దుర్వ కాంతులతో పాటు మల్లాపూర్‌ గ్రామానికి చెందిన పుసం సుభాష్‌లు వివాహితను బలవంతంగా ఆటోలో ఎక్కించి ఇంద్రవెల్లి మండలానికి తీసుకొస్తూ అసభ్యకరంగా ప్రవర్తించి లొంగదీసుకునేందుకు యత్నించాడు. ప్రతిఘటించడంతో ఆటో నుంచి తోసేశారు. దీంతో వివాహిత కుడికాలుకు గాయమైంది. బుధవారం బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

మరిన్ని వార్తలు