తల్లిపాలే.. విషం! ఈ బిడ్డ బాధ వర్ణనాతీతం(స్పాన్సర్డ్‌)

7 Aug, 2021 17:38 IST|Sakshi

అప్పుడే పుట్టిన బిడ్డకు తల్లి పాలే అమృతం... కానీ ఈ బిడ్డ విషయంలో తల్లిపాలు విషంలా మారుతున్నాయి. అప్పుడే పుట్టిన బిడ్డలకు సంక్రమించే అరుదైన వ్యాధి కారణంగా తల్లి పాలకు బిడ్డ దూరమవగా... బిడ్డకు పాలివ్వలేని దుస్థితిలో ఆ తల్లి చిక్కుకుంది. ప్రసవం జరిగినప్పటి నుంచి తన బిడ్డను కాపాడమంటూ తల్లి ఎలిజబెత్‌  నిత్యం దేవున్ని ప్రార్థిస్తూనే ఉంది.

తమిళనాడులోని ఈరోడ్‌కి చెందిన ఎలిజబెత్‌ , శివకుమార్‌ దంపతులు ఈ ఏడాది మార్చిలో మూడో సంతానం కలిగింది. అయితే ఎలిజబెత్‌కి కడుపు నొప్పి తీవ్రంగా రావడంతో అత్యవసర పరిస్థితుల్లో డాక్టర్లు ఆపరేషన్‌ చేయాల్సి వచ్చింది. నెలలు నిండకుండానే బిడ్డను ప్రసవించింది ఎలిజబెత్‌. దీంతో పసిబిడ్డకు అనారోగ్య సమస్యలు తలెత్తాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో పాటు మూత్ర పిండాల వైఫల్యం సమస్యలు తల్తెత్తాయి. ఎన్‌ఐసీయూ వార్డులో ఉంచి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. బాబుకి తల్లిపాలు పడటం లేదు. దీంతో ఐవీల ద్వారానే అవసరమైన మందులు అందిస్తున్నారు. బాబు వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 10 లక్షలు రెడీ చేసుకోవాల్సందిగా వైద్యులు సూచించారు.

కూలీ చేసుకునే శివకుమార్‌ నెల ఆదాయమే రూ. 5,500. అలాంటిది ఒక్కసారిగా పది లక్షల రూపాయలు సర్థుబాటు చేయాలంటూ వైద్యులు చెప్పేసరికి ఏం చేయాలో పాలుపోలేదు. మరోవైపు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కొడుకు. దీంతో ఆన్‌లైన్‌లో మెడికల్‌ ఎమర్జెన్సీలో ఫండ్‌ రైజ్‌ చేసే కెట్టోను సంప్రదించారు. ఎలిజబెత్‌, శివకుమార్‌ల బిడ్డను కాపాడేందుకు మీ వంతు సాయం అందించండి. (అడ్వర్టోరియల్)

మరిన్ని వార్తలు