రాయలసీమ ఎత్తిపోతల పథకంపై అఖిలపక్ష సమావేశం

25 Jun, 2021 11:57 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: రాయలసీమ ఎత్తిపోతలపై శుక్రవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ వాదాన్ని ఖండిస్తూ పోరాటం చేయాలని అఖిలపక్షం తీర్మానించింది. అనుమతులు లేకుండా తెలంగాణ కొత్త ప్రాజెక్ట్‌లు కడుతోందని అఖిలపక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాయలసీమ జిల్లాలు అత్యంత కరవు ప్రాంతాలని అఖిలపక్షం పేర్కొంది. రాయలసీమ ఎత్తిపోతలపై తెలంగాణ వితండవాదం చేస్తోందని.. మిగులు జలాలను తెలంగాణ అడ్డుకోవడం అన్యాయమని పేర్కొంది. శ్రీశైలానికి నీరు రాకుండా తెలంగాణ కొత్త ప్రాజెక్ట్‌లు కడుతోందని అఖిలపక్షం  ఆగ్రహం వ్యక్తం చేసింది.

చదవండి: శ్రీశైలంలో తెలంగాణ విద్యుదుత్పత్తిని ఆపండి

>
మరిన్ని వార్తలు