భూకబ్జాలో కొత్త కోణం: దళితుల భూమి వదల్లేదు

15 Jun, 2021 11:26 IST|Sakshi
పల్లా శ్రీనివాస్‌ రావు ( ఫైల్‌ ఫోటో )

దళితుల భూమి ఆక్రమించినట్లు పల్లా సోదరుడిపై ఆరోపణలు

సాక్షి, విశాఖపట్నం: టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌ రావు సోదరుడు శంకరరావు భూకబ్జాలో కొత్త కోణం వెలుగు చూసింది. శంకరరావు తమ భూమి ఆక్రమించినట్లు పలువురు దళితులు ఫిర్యాదు చేశారు. అజయ్‌బాబు, జైన్ అనే వ్యక్తులతో కలిసి శంకరరావు దళిత భూములు ఆక్రమణకు పాల్పడ్డట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

తుంగలం సర్వే నంబర్‌ 29/1లోని ఎకరా 30 సెంట్ల స్థలంలో పల్లా శంకరరావు బెదిరించి అక్రమ నిర్మాణాలు చేపట్టారంటున్నారు దళితులు. పల్లా సోదరుడి భూ ఆక్రమణలపై అప్పటి హోంమంత్రి చినరాజప్పకు తాము ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదన్నారు బాధితులు. టీడీపీ హయాంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపారు. 

చదవండి: కొనసాగుతున్న కబ్జా ప్రకంపనలు

మరిన్ని వార్తలు