సీఎం వైఎస్‌ జగన్‌తో ఎంపీ రంగయ్య, ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి భేటీ

18 Jan, 2023 09:13 IST|Sakshi
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న ఎంపీ రంగయ్య

సాక్షి, అనంతపురం: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అనంతపురం ఎంపీ తలారి రంగయ్య మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో రాజకీయ, సామాజిక, అభివృద్ధి పనులపై చర్చించారు.  

సీఎం జగన్‌తో ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి భేటీ
పుట్టపర్తి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి నియోజకవర్గంలో అత్యధికంగా జాతీయ రహదారుల మంజూరు, రికార్డు స్థాయిలో 25 వేల పక్కా గృహ నిర్మాణాలకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ముదిగుబ్బ మండలం మలకవేముల క్రాస్‌ నుంచి నల్లమాడ, ఓడీచెరువు, అమడగూరు మీదుగా బాగేపల్లి వరకూ జాతీయ రహదారి ఏర్పాటుకు సహకరించాలని వినతపత్రం సమర్పించారు.   

చదవండి: (పెద్దిరెడ్డి కాన్వాయ్‌ ప్రమాదంలో కుట్రకోణం)

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు