AP: బీసీ కార్పొరేషన్‌ల పదవీకాలం పొడిగింపు 

21 Jan, 2023 13:39 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్‌ల పదవీ కాలాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 139 వెనుకబడిన కులాలకు 56 సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే రెండేళ్ల కిందట ఏర్పాటు చేసిన ఆ కార్పొరేషన్‌ల పదవీకాలం ముగిసింది. దీంతో వాటిలో 55 బీసీ కార్పొరేషన్‌లను కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచి్చంది. తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ఆయా కార్పొరేషన్‌లకు చెందిన చైర్మన్‌లు, డైరెక్టర్లు పదవిలో కొనసాగుతారని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి  జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, పాల ఏకరి సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ టి.మురళీధర్‌ ఆ తర్వాత జెడ్పీటీసీ సభ్యుడిగా ఎంపికవడంతో ప్రస్తుతానికి ఆ కార్పొరేషన్‌ పదవీకాలాన్ని కొనసాగించలేదు.  

సీఎం జగన్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు   
కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల పదవీకాలాన్ని పొడిగిం­చిన నేపథ్యంలో బీసీల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పశి్చమగోదావరి జిల్లా తణు­కు­లో ఎంబీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పెండ్ర వీరన్న ఆధ్వర్యంలో రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సమక్షంలో సీఎం జగన్‌ చిత్రపటానికి క్షీరాభిõÙకం చేశారు. ఏలూరు జిల్లా గణపవరంలో రాష్ట్ర సూర్య బలిజ కార్పొరేషన్‌ చైర్మన్‌ శెట్టి అనంతలక్ష్మి ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబును సత్కరించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో శ్రీశయన, పొందర–కూరాకుల కా­ర్పొ­రేషన్‌ చైర్‌పర్సన్లు చీపురు రాణి, రాజాపు హైమావతి సీఎం జగన్‌ చిత్రపటానికి క్షీరాభిõÙకం చేశారు.   

బీసీలకు పెద్దపీట: ఏపీ బీసీ సంఘం  
సీఎం వైఎస్‌ జగన్‌ బీసీలకు అన్నింటా పెద్ద­పీట వేస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ మారేష్‌ అన్నారు. బీసీల కోసం 56  కార్పొరేషన్లు ఏర్పాటు చే­శా­రని గుర్తు చేశారు. వాటిని, వాటి పదవీ కా­లా­న్నీ తిరిగి యథాతథంగా కొనసాగిస్తూ శని­వా­రం ప్రభుత్వం జీవో జారీ చేయడంపై యా­వత్తు బీసీ లోకం హర్షం వ్యక్తం చేస్తోందన్నారు.    

మరిన్ని వార్తలు