దేశానికే ఆదర్శంగా జగనన్న కాలనీల్లో ఇంధన పొదుపు

25 Sep, 2023 05:16 IST|Sakshi
విశాల్‌ కపూర్‌కు నివేదిక అందజేస్తున్న అజయ్‌జైన్‌ తదితరులు   

ప్రతి ఇంటికీ 4 ఎల్‌ఈడీ బల్బులు, 2 ఎల్‌ఈడీ ట్యూబ్‌ లైట్లు, 2 బీఎల్‌డీసీ ఫ్యాన్లు

ఒక్కో ఇంట్లో ఏటా 734 యూనిట్ల విద్యుత్‌ ఆదా అవుతుందని అంచనా

ఈఈఎస్‌ఎల్‌ సహకారంతో గృహనిర్మాణ శాఖ అమలు

గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌ 

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతి­ష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘నవరత్నాలు–­పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్‌–­జగనన్న కాలనీల్లో పేదల కోసం నిర్మిస్తున్న గృహాల్లో ఇంధన సామర్థ్య చర్యలను దేశానికే రోల్‌ మోడల్‌గా అమలు చేయనున్నట్లు ఏపీ గృహనిర్మాణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌ తెలిపారు. ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌(ఈఈఎస్‌­ఎల్‌) సీఈవో విశాల్‌ కపూర్‌ తరఫున సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లు అనిమేష్‌ మిశ్రా, నితిన్‌భట్, సావి­త్రిసింగ్, పవన్‌లు అజయ్‌ జైన్‌ను కలిసినట్లు ఈఈ­ఎస్‌ఎల్‌ దక్షిణాది రాష్ట్రాల సలహాదారు ఎ.చంద్రశేఖ­రరెడ్డి తెలిపారు.

ఆయన ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం... హౌసింగ్‌ ఎండీ లక్ష్మీశా, జేడీ శివప్రసాద్, హౌసింగ్‌ డిపార్ట్‌మెంట్‌లో ఎనర్జీ ఎఫిషి­యెన్సీ ప్రాజెక్ట్‌ గురించి ఈఈఎస్‌ఎల్‌ అధికారులకు వివరించారు. అజయ్‌ జైన్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈఈఎస్‌ఎల్, కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అతిపె­ద్దదైన ఇంధన సామర్థ్య కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించనుందని తెలి పారు. సీఎం జగన్‌ సూచన మేరకు వైఎస్సార్‌–­జగ నన్న కాలనీల్లోని ఇళ్లకు అత్యంత నాణ్యమైన స్టార్‌ రేటెడ్‌ ఎనర్జీ ఎఫిషి­యెన్సీ పరికరాలను గృహనిర్మాణశాఖ ఆధ్వర్యంలోనే ఏపీ హౌసింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ అందించనుందని తెలిపారు.

ప్రతి ఇంటికి 4 ఎల్‌ఈడీ బల్బు­లు, 2 ఎల్‌ఈడీ ట్యూబ్‌లైట్లు, 2 ఎనర్జీ ఎఫిషియెన్సీ బీఎల్‌డీసీ ఫ్యాన్ల­ను మార్కెట్‌ ధర కన్నా తక్కువకు ఈఈఎస్‌ఎల్‌ సహకారంతో సమకూర్చనున్నట్లు చెప్పారు. అయితే ఇది స్వచ్చందమేనని, లబ్ధిదా­రులు తప్పనిసరిగా ఈ పరికరాలు తీసుకోవాలని లేదన్నారు. ఈ పరిక­రాలను వినియో గించడం వల్ల ప్రతి ఇంట్లో ఏటా 734 యూనిట్ల ఇంధనం ఆదా అవుతుందని ఈఈఎస్‌ ఎల్‌ అంచనా వేసిందని తెలిపారు. దాని ప్రకారం ఫేజ్‌–1లోని 15.6 లక్షల ఇళ్లకు రూ.352 కోట్ల వార్షిక ఇంధనం ఆదా అవుతుందని అజయ్‌ జైన్‌ వివరించారు.

మరిన్ని వార్తలు