23 నుంచి జోరుగా వానలు

20 Jun, 2021 04:38 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఉత్తర బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన రుతుపవన ద్రోణి ఆదివారం సాయంత్రానికి బలహీనపడే సూచనలున్నాయి. అలాగే ఉత్తర భారతదేశంలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్న తరుణంలో ఆయా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున రాష్ట్రంలో వర్షాలు పడే సూచనలు అంతగా కనిపించడం లేదని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. రాయలసీమ, దక్షిణ కోస్తాలో రానున్న రెండు రోజుల పాటు ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే సూచనలున్నాయన్నారు. రైతులు వ్యవసాయ పనులు కొనసాగించుకునేందుకు ఈ వాతావరణం అనుకూలంగా ఉంటుందని తెలిపారు. రాష్ట్రంపై ఆదివారం నుంచి బ్రేక్‌ మాన్‌సూన్‌ ప్రభావం మొదలవుతుందని, దీని కారణంగా కోస్తా, రాయలసీమల్లో మెలమెల్లగా వర్షాలు కురుస్తూ ఈ నెల 23 నుంచి జోరందుకుంటాయని వివరించారు.  

మరిన్ని వార్తలు