ఈనెల 26 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. బీఏసీ నిర్ణయం

18 Nov, 2021 10:23 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గురువారం బీఏసీ సమావేశం నిర్వహించారు. స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన ప్రారంభమైన బీఏసీ సమావేశానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌, అనిల్ కుమార్ యాదవ్, కురసాల కన్నబాబు హాజరయ్యారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు హాజరయ్యారు.

కాగా నవంబర్‌ 26 వరకు అసెంబ్లీ సమావేశాలను కొనసాగించాలని టీడీపీ కోరగా.. టీడీపీ డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఈ నెల 26 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు.
చదవండి: ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు

మరిన్ని వార్తలు