డబుల్‌ ఇస్మార్ట్‌కు మణిశర్మ స్వరాలు

25 Nov, 2023 04:35 IST|Sakshi

హీరో రామ్, దర్శకుడు పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ మూవీ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ (2019) సూపర్‌హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం రామ్, పూరి కాంబినేషన్‌లో ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ కి సీక్వెల్‌గా ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో సంజయ్‌ దత్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో జరుగుతోంది.

కాగా ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూర్చనున్నట్లు చిత్రయూనిట్‌ శనివారం వెల్లడించింది. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘పోకిరి, చిరుత, ఇస్మార్ట్‌ శంకర్‌’ వంటి హిట్‌ సినిమాలకు మణిశర్మ సంగీతం అందించిన సంగతి గుర్తుండే ఉంటుంది. పూరి జగన్నాథ్, చార్మీ కౌర్‌ నిర్మిస్తున్న ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ వచ్చే ఏడాది మార్చి 8న విడుదల కానుంది.

మరిన్ని వార్తలు